Begin typing your search above and press return to search.

'బిగ్ బాస్ 5' ఎప్పుడు..? ఈసారి హోస్ట్ ఎవరు..?

By:  Tupaki Desk   |   24 April 2021 2:39 AM
బిగ్ బాస్ 5 ఎప్పుడు..? ఈసారి హోస్ట్ ఎవరు..?
X
టెలివిజన్ రంగంలో విజయవంతమైన రియాలిటీ షో లలో 'బిగ్ బాస్‌' ఒకటి. హిందీ, తెలుగు, తమిళం‌, కన్నడం, మలయాళం.. ఇలా అన్ని భాషల్లోనూ ఈ షో నడుస్తోంది. ఇక తెలుగు ప్రేక్షకులకు అసలైన రియాలిటీ షో మజాని పరిచయం చేసిన 'బిగ్ బాస్ తెలుగు' కు ఓ రేంజ్ లో ఆదరణ లభించింది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా నాలుగు సీజన్లు పూర్తి చేసుకుని.. ఐదో సీజన్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.

నిజానికి సీజన్-4 గతేడాది జూన్‌ లోనే రావాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా సెప్టెంబర్‌ లో వచ్చింది. 106 రోజుల పాటు సాగిన తెలుగు 'బిగ్ బాస్-4' మహమ్మారి కారణంగా వినోదానికి దూరమైన జనాలకు ఉపశమనం కలిగించింది. చివరి వరకు బరిలో ఉన్న అభిజీత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. అయితే సీజన్-5 ఆలస్యం కాకుండా ఆర్నెళ్లు తిరిగే సరికి మళ్లీ వచ్చేస్తుందని ఆ మధ్య చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే 'బిగ్ బాస్' షో ఈసారి కూడా ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది.

తెలుగు 'బిగ్ బాస్' నిర్వాహకులు సీజన్-5 ను ముందుగా 2021 మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో మొదలు పెట్టాలని అనుకున్నారట. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు కంటెంస్టెంట్స్ ని కూడా ఇంటర్వ్యూ చేసారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు కరోనా పరిస్థితుల కారణంగా ఐదో సీజన్ కూడా సెప్టెంబర్ నెలలో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని టాక్ నడుస్తోంది. అంతేకాక గత రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేసిన 'కింగ్' అక్కినేని నాగార్జున సీజన్-5 కి హోస్టుగా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతోంది. తెలుగు బిగ్ బాస్ ఈసారి ప్రేక్షకులకు అలరించడానికి ఎలాంటి థీమ్ తో రాబోతున్నాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.