Begin typing your search above and press return to search.
కేజీఎఫ్ కు కైకాలకు సంబంధం ఏంటీ?
By: Tupaki Desk | 22 Nov 2021 7:44 AM GMTకన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కేజీఎఫ్ కు సీక్వెల్ ఇప్పుడు విడుదలకు సిద్దం అవుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో వందల కోట్ల వసూళ్లను దక్కించుకున్న కేజీఎఫ్ సినిమా కన్నడ సినీ చరిత్రలో నిలిచి పోయే సినిమా అనడంలో సందేహం లేదు. అప్పటి వరకు 50 నుండి 60 కోట్ల వసూళ్లను భారీ వసూళ్లుగా భావించిన కన్నడ సినీ పరిశ్రమ కు కేజీఎఫ్ వందల కోట్లను చూపించి కంటెంట్ ఉంటే ఎక్కడైనా ఆడుతుందని నిరూపించింది. కేజీఎఫ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒక బ్రాండ్ అనడంలో సందేహం లేదు. అలాంటి భారీ సినిమాను తెలుగు లో సమర్పించింది కైకాల సత్యనారాయన అనే విషయం తెల్సిందే.
కేజీఎఫ్ లో ఆయన నటించలేదు.. ఆయన నిర్మించలేదు.. ఆయనకు సంబంధించిన వారు ఎవరు ఉన్నారు ఆ సినిమాలో ఎందుకు ఆయన కేజీఎఫ్ ఎఫ్ ను సమర్పించారు అంటూ చాలా మంది చాలా రకాల అనుమానాలత ఉన్నారు. కైకాల సత్యనారయణ ను గౌరవించే ఉద్దేశ్యంతో ఆయన పేరును సమర్పకుడిగా వేసినట్లుగా కొందరు అనుకుంటున్నారు. కాని అసలు విషయం ఏంటీ అంటే కైకాల వారి వారసుడు నిర్మాతగా కన్నడ సినిమా రంగంలో ఉన్నాడు. ఆయనే కేజీఎఫ్ సినిమా కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. సినిమాకు వచ్చిన బజ్ నేపథ్యంలో తెలుగు లో కూడా రిలీజ్ చేస్తే బాగుంటుంది అనే నిర్ణయానికి వచ్చి డబ్బింగ్ చేయడం జరిగింది.
ఆ సమయంలో సినిమాను తెలుగు లో కైకాల సత్యనారాయణ సమర్పిస్తే బజ్ ఎక్కువగా ఉంటుందని.. అలాగే ఆయన కు గౌరవం కల్పించినట్లుగా అవుతుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. కేజీఎఫ్ 2 ను కూడా కైకాల సమర్పణలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కేజీఎఫ్ టైటిల్ కు ముందే కైకాల వారి పేరును వేసి ఆయనకు సముచిత గౌరవంను ప్రశాంత్ నీల్ కల్పించాడు. ప్రస్తుతం కైకాల వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఎన్నో వందల సినిమాలను చేసిన కైకాల సత్యనారాయణ ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం కుదుట పడి మళ్లీ ఆయన సినిమాల్లో కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.