Begin typing your search above and press return to search.
అవతార్ 6-7 గురించి బాంబ్ పేల్చాడు!
By: Tupaki Desk | 3 Dec 2022 3:30 AM GMTజేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ రికార్డుల గురించి ఇప్పటికీ చర్చ సాగుతోంది. ఇంతలోనే ఈ ప్రతిష్ఠాత్మక ఫ్రాంచైజీ నుంచి రెండో భాగం `అవతార్: ది వే ఆఫ్ వాటర్` డిసెంబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రబృందం ప్రచారంలో బిజీగా ఉంది. దిగ్గజ దర్శకనిర్మాత జేమ్స్ కామెరూన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవతార్ విశ్వం గురించి భారీ ప్రణాళికల గురించి ఓపెనయ్యారు. ప్రస్తుతానికి అవతార్ సిరీస్ లో ఐదు సినిమాలకు ప్రణాళిక ఉంది. కానీ ఇందులో ఆరో భాగం ఏడో భాగం కూడా ఉంటాయని ఇప్పుడు జేమ్స్ కామెరూన్ బాంబ్ పేల్చాడు. భవిష్యత్తు కోసం తాను ఇప్పటికే ప్రణాళికలు కలిగి ఉన్నానని చెప్పాడు.
వాస్తవానికి `ది వే ఆఫ్ వాటర్` తర్వాత రెండు `అవతార్` సీక్వెల్ లను అభివృద్ధి చేయడం ప్రారంభించాడు. మొత్తం ఐదు చిత్రాలకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశాడు. అయితే అవతార్- 6 .. అవతార్ 7 విడుదలయ్యే సమయానికి అతను ఎనభై వయసు దాటి ఇప్పటిలా హుషారు ప్రదర్శించే పరిస్థితి ఉండదు. వయసు సహకరించకపోతే సీక్వెళ్లను ముందుకు నడిపించడం ఎలా? అన్నదానికి ఇప్పటికే జేమ్స్ ప్రణాళికలు సిద్ధం చేయడం షాకిస్తోంది.
తాను నేరుగా బరిలోకి దిగి దర్శకత్వం చేయలేనప్పుడు ఫ్రాంచైజీని స్వాధీనం చేసుకునేందుకు ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటున్నానని అతడు ప్రకటించాడు. ఏది ఏమైనప్పటికీ ఈ సిరీస్ ఎప్పటికీ కొనసాగాలంటే అభిమానుల్లో ఆసక్తి ఇలానే కొనసాగాలి. అది ఎప్పుడు డ్రాప్ అవుతుందో అప్పుడు సిరీస్ ని ముగిస్తారు. మరో 13 రోజుల్లో విడుదలకు సిద్ధమవుతున్న `వే ఆఫ్ ది వాటర్` ప్రపంచ దేశాల్లో సంచలనాలు సృష్టిస్తుందని అంచనాలేర్పడ్డాయి.
అయితే భవిష్యత్తులో అవతార్ ఇతర సినిమాల్లానే ఓటీటీ స్ట్రీమింగ్ లోకి వెళ్లడాన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? అని ప్రశ్నించగా.. కామెరాన్ ఇలా అన్నాడు. ``ఈ CG క్యారెక్టర్ ల సమస్య ఏమిటంటే అవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. చాలా శ్రమతో కూడుకున్నవి. ఇలాంటివి నిజంగా TV కోసం పని చేయవు`` అని వ్యాఖ్యానించారు.
ది వే ఆఫ్ వాటర్ గురించి ఏమన్నారు?
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో ట్వంటీయత్ సెంచరీ స్టూడియోస్ పంపిణీ చేసిన `అవతార్: ది వే ఆఫ్ వాటర్` చిత్రం అవతార్ ఫిల్మ్ సిరీస్ లో రెండవ భాగం. 350 - 400 మిలియన్ల డాలర్ల అంచనా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆల్ టైమ్ అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా రికార్డులకెక్కింది. మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ లో పార్ట్ 1లోని ప్రధాన పాత్రలు జేక్ సుల్లీ (సామ్ వర్తింగ్టన్) - నెయితిరి (జో సల్దానా)లు తిరిగి తెరపైకి వస్తున్నారు. ఈ జంట సరికొత్త సాహసానికి శ్రీకారం చుడుతున్నారు. ఈసారి రెండో భాగంలో పేరెంట్ హుడ్ తో కనిపిస్తారు. అవతార్ స్టార్లలోకి కొత్తవాళ్లలో కేట్ విన్స్ లెట్- క్లిఫ్ కర్టిస్- మిచెల్ యోహ్- ఈడీ ఫాల్కో, - జోయెల్ డేవిడ్ మూర్ - CCH పౌండర్ చేరగా.. సిగౌర్నీ వీవర్ -స్టీఫెన్ లాంగ్ కూడా ఈ చిత్రంలో తమ పాత్రలను తిరిగి పోషించనున్నారు.
జేమ్స్ కామెరాన్ అన్నీ సంచలనాలే..
హాలీవుడ్ లో అత్యంత విజయవంతమైన దర్శకనిర్మాతలలో జేమ్స్ కామెరూన్ ఒకరు. ఆయన తెరకెక్కించిన టెర్మినేటర్-ఏలియన్స్-టైటానిక్ ఎంతటి సంచలనాలో తెలిసిందే. వాటన్నిటినీ మించి `అవతార్`తో మరో లెవల్ అని నిరూపించాడు. నెవ్వర్ బిఫోర్ అనిపించే అవతార్ సిరీస్ కర్తగా ఆయన ఎనలేని గౌరవాన్ని ప్రేమను అందుకుంటున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ కామెరూన్ అన్న పేరు తెలియని వారు లేరంటే అవతార్ ప్రభంజనం ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు. లెజెండరీ దర్శకుడు ఎన్నో సంవత్సరాలుగా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.