Begin typing your search above and press return to search.

లైగర్ ఫ్లాప్ అయితే? VD షాకింగ్ ఆన్స‌ర్!

By:  Tupaki Desk   |   24 Aug 2022 3:59 AM GMT
లైగర్ ఫ్లాప్ అయితే? VD షాకింగ్ ఆన్స‌ర్!
X
లైగ‌ర్ పాన్ ఇండియా విడుద‌ల ఎగ్జ‌యిట్ చేస్తోంది. దేశంలోని అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో పూరి అండ్ టీమ్ కావాల్సినంత ప్ర‌చారం చేసారు. హిందీ ఆడియెన్ టార్గెట్ గా ప్ర‌చారం లో బాలీవుడ్ వాళ్ల‌కే ఆద‌ర్శంగా నిలిచింది లైగ‌ర్ టీమ్. ఇక లైగర్ విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. విజయ్ దేవరకొండ- అనన్య పాండే జంట‌ దేశవ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్ ని కొన‌సాగించ‌డంలో ఇప్ప‌టికీ బిజీగా ఉన్నారు.

తాజా మీడియా స‌మావేశంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు షాకింగ్ క్వ‌శ్చ‌న్ ఎదురైంది. ఒక‌వేళ‌ లైగర్ ఫ్లాప్ అయితే మీ రియాక్షన్ ఏమిటి? అంటూ ఒక మీడియా ప్ర‌తినిధి విజయ్ ని అడిగారు. ఏ మాత్రం సంకోచించకుండా విజయ్ "కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రశ్న నన్ను అడిగి ఉంటే నేను కోపంతో సమాధానం చెప్పేవాడిని. నాకు చాలా కోపం వచ్చేది. అయితే గత కొద్దిరోజులుగా నాకు లభించిన ప్రేమను చూశాక‌.. నా చుట్టుపక్కల ఇలాంటి చిన్న విషయాలకు కోపంగా స్పందిస్తే అది ఆ ప్రేమకు అగౌరవం అవుతుంది" అని వ్యాఖ్యానించారు.

ఈ చిత్రం క‌చ్ఛితంగా హిట్ అవుతుందని తాను భావిస్తున్నాన‌ని.. ప్ర‌జ‌ల‌ స్పందన చూసి తన ఊహను తప్పు పట్టలేమని విజయ్ పేర్కొన్నాడు. పూరి జగన్ దర్శకత్వం వహించిన లైగర్ చిత్రానికి క‌ర‌ణ్ స‌మ‌ర్ప‌కులుగా ఉన్నారు.

పెరిగిన టికెట్ ధ‌ర‌లు పెద్ద ప్ల‌స్..! ఇరు తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్టు ధ‌ర‌లు లైగ‌ర్ కి ప్ల‌స్ కానున్నాయి. గ‌త కొంత‌కాలంగా అన్ని పెద్ద సినిమాల‌కు టిక్కెట్టు ధ‌ర‌ల‌ను పెంచుకునే వెసులుబాటును కేసీఆర్ ప్ర‌భుత్వం క‌ల్పిస్తోంది. టాలీవుడ్ హైద‌రాబాద్ ను వ‌దిలి ఎటూ పోకుండా కేసీఆర్ ప్ర‌భుత్వం అన్నివిధాలా వెసులుబాటు క‌ల్పిస్తోంచ‌డం సినిమాల‌కు క‌లిసి వ‌స్తోంది. ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్పుడు స్థిరంగా టిక్కెట్టు ధ‌ర‌ల‌ను కొన‌సాగిస్తోంది. విజయ్ దేవరకొండ న‌టించిన త‌దుప‌రి చిత్రం లైగర్ కి ఇది ప్ల‌స్. ఇక‌ ఏపీతో పోలిస్తే నైజాంలో టిక్కెట్టు ధ‌ర‌లు మ‌రింత మెరుగ్గా ఉన్నాయి.

తెలంగాణాలో పెరిగిన ధరలతో బహుభాషా చిత్రం లైగ‌ర్ నైజాంలో భారీ రికార్డులు నెల‌కొల్పుతుంద‌ని అంచ‌నా. సినిమా టిక్కెట్ ధరలు (GSTతో సహా) ప‌రిశీలిస్తే.. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ - రూ.175 .. మల్టీప్లెక్స్‌ల్లో - రూ.250 వ‌ర‌కూ టికెట్ ధ‌ర‌ను పెంచారు. ఇటీవలి కాలంలో విడుదలైన ఏ తెలుగు సినిమాల్లో అన్నిటికంటే ఇదే అత్యధికం. అయితే ఏపీలో టిక్కెట్ ధరలు సాధారణంగానే ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ కు రూ.147.. మల్టీప్లెక్స్ కు రూ.177గా ఉంది. లైగ‌ర్ మోస్ట్ అవైటెడ్ మూవీ కాబ‌ట్టి ఇక్క‌డ టిక్కెట్ ధ‌ర‌ల పెంపు పెద్ద‌గా క‌లిసి వ‌స్తుంద‌ని అంచ‌నా.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌- అన‌న్య పాండే జంట‌గా న‌టించిన లైగ‌ర్ లో మైక్ టైసన్,- రమ్య కృష్ణన్ - విషు రెడ్డి త‌దిత‌రులు ఇత‌ర‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. లైగర్ తో అనన్య పాండే కథానాయికగా టాలీవుడ్ కి ప‌రిచ‌యం అవుతోంది. ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరి కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 25 ఆగస్టు 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది.