Begin typing your search above and press return to search.
అక్కినేని ఫ్యామిలీ ఏంటి ఇలా..??
By: Tupaki Desk | 26 July 2022 2:30 AM GMTతెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. లెజండరీ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో ఏళ్ళు సినీ ఇండస్ట్రీకి తన సేవలు అందించారు. ఏఎన్నార్ లెగసీని కొనసాగిస్తూ వచ్చిన కింగ్ నాగార్జున.. కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక తండ్రి బాటలో నాగచైతన్య - అఖిల్ లు కూడా టాలీవుడ్ లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇదే ఫ్యామిలీ నుంచి సుమంత్ - సుశాంత్ కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే ఎంతమంది వచ్చినా ఇటీవల కాలంలో అక్కినేని హీరోలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్లు నమోదు చేయలేకపోతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అక్కినేని నాగార్జున తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించి టాలీవుడ్ కు మెయిన్ పిల్లర్స్ లో ఒకరిగా నిలిచారు. అన్ని రకాల జోనర్స్ లో విలక్షణమైన పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు నాగ్. తన సినిమాలతో ఇండస్ట్రీకి ఎంతోమంది న్యూ టాలెంట్ ని పరిచయం చేసారు.
నాగ్ ఆరు పదుల వయసులోనూ ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన రేంజ్ కు తగ్గ బ్లాక్ బస్టర్ అందుకోలేకపోతున్నారని అభిమానులు సైతం నిరాశ చెందుతున్నారు. ఓవైపు చిరంజీవి - బాలకృష్ణ - వెంకటేశ్ దూసుకుపోతుంటే.. నాగ్ మాత్రం వారికంటే వెనుకబడి పోతున్నారని కామెంట్ చేస్తున్నారు.
సుమంత్ - సుశాంత్ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళయినా ఇప్పటికీ హీరోలుగా నిలదొక్కుకోలేకపోతున్నారని అంటున్నారు. నాగచైతన్య తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో నాలుగు వరుస హిట్లు అందుకొని ఫుల్ ఫార్మ్ లో ఉన్నట్లు కనిపించాడు.
కానీ ఇప్పుడు 'థాంక్యూ' సినిమా మినిమమ్ ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోకపోవడంతో యువసామ్రాట్ స్టార్ పవర్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారీ అంచనాలతో హీరోగా లాంచ్ చేయబడిన అఖిల్.. తొలి సక్సెస్ అందుకోడానికి చాలా కాలమే పట్టింది. ఎట్టకేలకు హిట్టు కొట్టాడు కానీ.. అది ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచే బ్లాక్ బస్టర్ అయితే కాదు.
ఈ నేపథ్యంలో మిగతా ఫ్యామిలీ హీరోలంతా 50 కోట్ల షేర్ - 100 కోట్ల గ్రాస్ అంటూ భారీ విజయాలతో దూసుకుపోతుంటే.. అక్కినేని హీరోలు మాత్రం ఆ మార్క్ ను క్రాస్ చేయలేకపోతున్నారే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అసలు అక్కినేని ఫ్యామిలీకి ఏమైందనే చర్చలు జరుగుతున్నాయి.
'అక్కినేని' నుంచి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా ఆశించిన ఓపెనింగ్స్ సాధించలేకపోతున్నాయి.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ పెట్టడంలో చతికిలబడుతున్నాయి. ఒకప్పుడు మాస్ ఓపెనింగ్స్ మొత్తం ఇప్పుడు ఎందుకు లేవని ఫ్యాన్స్ సైతం ఆందోళన చెందుతున్నారు.
ఇది ఇలానే జరిగితే రాబోయే రోజుల్లో అక్కినేని హీరోల సినిమాలు అంటే ఆడియన్స్ లో పూర్తిగా ఇంట్రెస్ట్ తగ్గిపోయే ప్రమాదం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు అక్కినేని హీరోలు తమ బాక్సాఫీస్ స్టామినా మరియు స్టార్ పవర్ ఏంటో చూపించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
ఇప్పుడు అక్కినేని అభిమానుల ఆశలన్నీ అఖిల్ నుంచి వచ్చే ''ఏజెంట్'' సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాపై నెలకొన్న బజ్ కి తగ్గట్టుగా బ్లాక్ బస్టర్ కొడితే రానున్న రోజుల్లో యూత్ కింగ్ 'అక్కినేని' ఫ్యామిలీని లీడ్ చేస్తాడని.. కాంపౌండ్ లోని మిగతా హీరోలకు కూడా ఊపు తీసుకొస్తాడాని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.