Begin typing your search above and press return to search.
ఆ హీరో భార్య తన భర్త సంపాదనపై ఆధారపడదట...!
By: Tupaki Desk | 22 May 2020 7:30 AM GMTదివంగత స్టార్ డైరెక్టర్ ఇ.వి.వి.సత్యనారాయణ గారి చిన్న కొడుకుగా ఎంట్రీ ఇచ్చి వెండి తెరపై గత కొన్నేళ్లుగా తనదైన హాస్యంతో ఆకట్టుకుంటూ వరుస విజయాల్ని సొంతం చేసుకున్నారు యంగ్ హీరో అల్లరి నరేష్. తన కెరీర్లో ఇప్పటి వరకు 55 చిత్రాలను పూర్తి చేసిన నరేష్ తన మొదటి సినిమా 'అల్లరి'తో 'అల్లరి నరేష్'గా మారిపోయారు. హీరోగా నటిస్తూనే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అలాంటి వాటిలో ‘గమ్యం’ ‘శంభో శివ శంభో’ 'బెండు అప్పారావు' 'బ్లేడ్ బాబ్జీ' 'సీమ శాస్త్రి' 'అత్తిలి సత్తిబాబు' 'నేను' 'కితకితలు' 'కత్తి కాంతారావు' 'మహర్షి' సినిమాల్లో అల్లరి నరేష్ నటన అద్భుతమని చెప్పవచ్చు. ఇప్పటికీ చిన్న నిర్మాతలకు వరంగా పెద్ద దిక్కుగా ఉంటున్నాడు అల్లరి నరేష్.
ఇదిలా ఉండగా అల్లరి నరేష్ తన తండ్రి మరణం తర్వాత నాలుగేళ్లకు 2015 మే 29న చెన్నయ్ చెందిన విరూపని వివాహం చేసుకున్నాడు. నిజానికి ఈమె విజయవాడకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఈమె తల్లిదండ్రులు ఉద్యోగాల రీత్యా చెన్నైలో సెటిల్ అయ్యారు. విరూప సినీ హీరోని పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె సినిమాలు ఎక్కువగా చూడదట. నరేష్ తో పెళ్ళైన రెండు వారల తరువాత నరేష్ హీరోగా నటించిన 'నేను' సినిమా చూసిందట. అంతేకాకుండా అల్లరి నరేష్ సతీమణికి స్వంత కాళ్లపై నిలబడటం ఇష్టమట. అందుకే తన భర్త హీరోగా సంపాదిస్తున్నప్పటికీ అతని సంపాదనపై ఆధారపడకుండా జీవించాలని నిర్ణయించుకుందట. అందుకే ఆర్కిటెక్ట్ గా పనిచేస్తుందట. అల్లరి నరేష్ దంపతులకి ఇప్పుడు ఒక పాప కూడా ఉంది. పాప పేరు ఇవికా. అల్లరి నేరేష్ తన భార్యా పిల్లలకి సంబంధించిన విషయాలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.
అల్లరి నరేష్ ప్రస్తుతం ‘నాంది’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. ఇండస్ట్రీ క్రైసిస్ లో ఉన్న కారణంగా ఈ సినిమాకు పనిచేసే కార్మికులందరికీ అండగా నిలవాలని అల్లరి నరేష్ - సతీష్ వేగేశ్నతో కలిసి ప్రతి ఒక్క కార్మికుడికి రూ.10 వేలు అందజేసి మంచి మనసు చాటుకున్న విషయం తెలిసిందే.