Begin typing your search above and press return to search.
ఈ డైలమాకు చెక్ పెట్టేందుకు చిరు ఏం చేయబోతున్నారు?
By: Tupaki Desk | 2 July 2021 4:12 AM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల్లో ఆరుగురు సభ్యులు ఎవరికి వారు సపరేట్ ఎజెండాలతో అధ్యక్ష పదవి బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ ని ప్రకటించారు. ఆయన ఆర్నెళ్లుగా మా ఎన్నికల్లో గెలుపుపై కసరత్తు చేస్తున్నారు. మొదటి సారిగా ఆయనే మెగాస్టార్ చిరంజీవిని కలిసి మద్ధతు కోరారు. చిరు- నాగబాబు మద్ధతు ఆయనకు ఉందని కథనాలొచ్చాయి.
ఇటీవలే ప్రకాష్ రాజ్ ప్యానెల్ ని కూడా మీడియా ముందు అధికారికంగా ప్రకటించారు. ఆయన ప్యానెల్ లో ప్రస్తుతం `మా` కమిటీ సభ్యులు చేరడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ ని ప్రకటించాక వీకే నరేష్ తన పదవిని విరమిస్తున్నానని మీడియా సమావేవంలో ప్రకటించారు. గడిచిన కొద్దిరోజులుగా ప్రకాష్ రాజ్ వర్సెస్ వీకే నరేష్ ఎపిసోడ్స్ తెలిసినదే.
ఇక సడెన్ గా మంచు విష్ణు కూడా అధ్యక్ష పదవి రేస్ లోకి వచ్చారు. అతడికి గత అధ్యక్షుడు వీకే నరేష్ మద్ధతు పలికారు. కృష్ణ- కృష్ణంరాజు వంటి ప్రముఖుల సపోర్ట్ ని ఆ ఇద్దరూ దక్కించుకున్నారు. మంచు విష్ణు - ప్రకాష్ రాజ్ మధ్య స్పష్టమైన పోటీ ఉంది. వీరిద్దరికీ పరిశ్రమలో మంచి మద్దతు ఉంది. అలాగే రేసులో జీవిత రాజశేఖర్- హేమ- సీవీఎల్ నరసింహారావు వంటి ప్రముఖులు మా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. వీళ్లతో పాటే సహజనటి జయసుధ పేరు తెరపైకొచ్చింది. జయసుధను ఏకగ్రీవం చేస్తారని సినీపెద్దలు దానిపై ఆలోచిస్తున్నారని కథనాలొచ్చాయి.
అయితే ఎన్ని ఊహాగానాలు చెలరేగినా కానీ.. మెగాస్టార్ చిరంజీవి ఎవరికి మద్ధతునిస్తే వారే గెలుస్తారన్నది తెలిసినదే. తాజా సమాచారం మేరకు.. ఇంతకుముందు కృష్ణ-కృష్ణం రాజు వంటి పెద్దల్ని కలిసిన మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో పాటు చిరును సందర్శించి తన మద్దతు కోరారని తెలిసింది. ఆలస్యంగానే అయినా కానీ ఆ ఇద్దరూ కలిసారన్న గుసగుసా వినిపిస్తోంది. అయితే ఎంతమంది చిరుని కలిసినా ఆయన మద్ధతు ఒకరికే ఉంటుంది. ఆ ఒక్కరు ఎవరన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. సెప్టెంబరులో జరగనున్న ఎన్నికలలో చిరంజీవి ఎవరికి మద్దతు ఇస్తారో అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. అతను ప్రకాష్ రాజ్ వంటి సన్నిహిత నటుడు.. బలమైన వ్యక్తిత్వం కోసం సపోర్ట్ గా నిలుస్తారా? లేక తన స్నేహితుడు మోహన్ బాబు కొడుకుకు సహాయం చేస్తారా? అన్నది డైలమాగా మారింది. మరోవైపు సహజనటి జయసుధను లేడీ కోటాలో మా అసోసియేషన్ అధ్యక్షరాలిని చేయాలని చిరు భావిస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. స్నేహితుడి కొడుకు.. పరిశ్రమ సన్నిహితుడు.. ఇద్దరినీ కాదని ఆ మూడో వ్యక్తికే చిరు మద్ధతునిస్తారా? అన్నది కూడా సస్పెన్స్ గానే మారింది. ఇంతకీ మెగాస్టార్ మద్ధతు ఎవరికి అన్నది తెలిసేదెలా?