Begin typing your search above and press return to search.
స్టార్ డైరెక్టర్ - ప్రభాస్ మధ్య ఏం జరుగుతోంది?
By: Tupaki Desk | 31 March 2022 8:40 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల 'రాధేశ్యామ్' చిత్రంతో దాదాపు మూడున్నరేళ్ల విరామం తరువాత ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో రూపొందిన ఈ చిత్రం తొలి రోజే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో సినిమా ఫలితం విషయంలో ఫ్యాన్స్ కొంత నిరుత్సాహానికి లోనయ్యారు. ఈ మూవీ రిలీజ్ తరువాత ప్రభాస్ భుజం గాయం కారణంగా ప్రత్యేక ఆపరేషన్ కోసం స్పెయిన్ వెళ్లారు. అక్కడి డాక్టర్ల సలహా మేరకు మైనర్ ఆపరేషన్ చేయించుకున్న ప్రభాస్ ప్రస్తుతం అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారట.
ఇదిలా వుంటే ఆపరేషన్ కారణంగా ఆయన తదుపరి చిత్రం 'సలార్' రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయిని ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ తరువాత డాక్టర్లు రెండు నెలల పాటు ప్రభాస్ ని విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో 'సలార్' షూటింగ్ మరింత ఆలస్యం కానుందని, తద్వారా రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం వుందని చెబుతున్నారు. ఈ మూవీతో పాటు ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె, సందీప్ వంగాతో చేయబోతున్న 'స్పిరిట్' చిత్రాలు కూడా మరింత ఆలస్యం కాబోతున్నాయట.
ఇదిలా వుంటే ప్రభాస్ కు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. ప్రభాస్ స్పెయిన్ వెళ్లడానికి ముందు స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య ఓ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చ జరిగిందని, ఇదే సందర్భంగా దర్శకుడు కొరటాల శివ హీరో ప్రభాస్ కు స్టోరీ కూడా వినిపించారట. స్టోరీ నచ్చడంతో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని చెబుతున్నారు.
ఈ మూవీని యువీ క్రియేషన్స్ నిర్మించే అవకాశం వుందని ఇన్ సైడ్ టాక్. ప్రభాస్ నటించిన 'మిర్చి' చిత్రంతో కొరటాల శివ డైరెక్టర్ గా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత మళ్లీ ప్రభాస్ తో కలిసి వర్క్ చేయాలని కొరటాల శివ ప్రయత్నాలు చేస్తున్నారట.
అది త్వరలోనే కార్యరూపం దాల్చబోతోందని చెబుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా వున్నారు. సలార్, ప్రాజెక్ట్ కె చిత్రీకరణ దశలో వున్నాయి. సందీప్ రెడ్డి వంగ 'స్పిరిట్' సెట్స్ పైకి రావాల్సి వుంది.
మధ్యలో మారుతి సినిమా అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే కాబోతోంది. కొరటాల శివ త్వరలో ఎన్టీఆర్ తో సినిమాని పట్టాలెక్కించబోతున్నారు. ఈ మూవీ జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. మారుతి తరహాలోనే రాకెట్ స్పీడుతో సినిమాని పూర్తి చేస్తానని కొరటాల మాటిస్తే గానీ ప్రభాస్ తన ప్రాజెక్ట్ ని మొదలుపెట్టే ఛాన్స్ లేదు.