Begin typing your search above and press return to search.

యువీ క్రియేష‌న్స్ ఆఫీస్ లో ఏం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   2 Nov 2022 6:36 AM GMT
యువీ క్రియేష‌న్స్ ఆఫీస్ లో ఏం జ‌రుగుతోంది?
X
టాలీవుడ్ లో వున్న భారీ నిర్మాణ సంస్థ‌ల్లో ప్ర‌భాస్ స‌హ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్న యువీ క్రియేష‌న్స్ ఒక‌టి. గ‌త కొంత కాలంగా ప్ర‌భాస్ తో పాటు ప‌లు టైర్ టు హీరోల‌తో సినిమాలు నిర్మిస్తోంది. త్వ‌ర‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో అత్యంత భారీ స్థాయిలో ఓ పాన్ ఇండియా మూవీకి శ్రీ‌కారం చుట్ట‌బోతోంది. అంతే కాకుండా 'ఆది పురుష్‌' తెలుగు హ‌క్కుల్ని కూడా ద‌క్కించుకుని వార్త‌ల్లో నిలిచింది. రీసెంట్ గా ప్ర‌భాస్ తో 'రాధేశ్యామ్‌' వంటి భారీ పాన్ ఇండియా మూవీని కూడా నిర్మించింది.

ఇలాంటి యువీ క్రియేష‌న్స్ ఆఫీస్ లో జీఎస్టీ నిఘా విభాగం సోదాలు నిర్వ‌హించ‌డం టాలీవుడ్ వ‌ర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లాన్ని సృష్టించింది. యువీ క్రియేష‌న్స్ సంస్థ‌కు వ‌స్తున్న ఆదాయానికి, చెల్లిస్తున్న జీఎస్టీ లెక్క‌ల‌కు చాలా వ్య‌త్యాసం వుంద‌ని జీఎస్టీ నిఘా విభాగం అధికారులు తాజాగా యువీ క్రియేష‌న్స్ ఆఫీస్ లో జ‌రిపిన సోదాల్లో నిర్ధార‌ణ‌కు వ‌చ్చార‌ని తెలిసింది.

అ విష‌యంపై ఇటీవ‌ల ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన జీఎస్టీ నిఘా విభాగం అధికారులు హైద‌రాబాద్ కాపూరి హిల్స్ లో వున్న యువీ క్రియేష‌న్స్ ఆఫీస్ లో సోదాలు నిర్వాహించారు.

మంగ‌ళ‌వారం రాత్రి వ‌ర‌కు జ‌రిపిన సోదాల్లో రూ. 6 కోట్ల‌కు పైగా జీఎస్టీ బ‌కాయిలు వున్న‌ట్టుగా అధికారులు ప్రాథ‌మికంగా తేల్చేశారు. దీంతో లోతుగా ప‌రిశీల‌న చేయాల‌ని భావించిన జీఎస్టీ నిఘా విభాగం అధికారులు యువీ సంస్థ‌కు సంబంధించిన రికార్డుల్ని స్వాధీనం చేసుకున్నార‌ని తెలిసింది.

స‌ద‌రు రికార్డుల్ని పూర్తి స్థాయిలో ప‌రిశీలించాకే యువీ క్రియేష‌న్స్ సంస్థ ఎంత జీఎస్టీ బాకాయిలు చెల్లించాల్సి వుందో తెలుస్తుంద‌ని జీఎస్టీ నిఘా విభాగం అధికారులు చెప్పిన‌ట్టుగా తెలిసింది.

యువీ క్రియేష‌న్స్ సంస్థ‌ని ప్ర‌భాస్ సోద‌రుడు ప్ర‌బోధ్ తో పాటు స్నేహితులు యువీ కృష్ణారెడ్డి నిర్వ‌హిస్తున్నారు. ఈ సంస్థ‌లో 'మిర్చి' నుంచి రాధేశ్యామ్ వ‌ర‌కు ప్ర‌భాస్ మూడు భారీ ప్రాజెక్ట్ లు చేశాడు. ఇదిలా వుంటే ఈ సంస్థ ప్ర‌భాస్ న‌టించిన 'సాహో', రాధేశ్యామ్ సినిమాల‌కు 200 నుంచి 300 కోట్ల మేర ఖ‌ర్చు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన స్థాయి విజ‌యాన్ని సొంతం చేసుకోని విష‌యం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.