Begin typing your search above and press return to search.

100 కోట్ల షేర్ కి ప‌న్ను క‌ట్టారా?

By:  Tupaki Desk   |   1 Jun 2019 6:46 AM GMT
100 కోట్ల షేర్ కి ప‌న్ను క‌ట్టారా?
X
మా సినిమా 100 కోట్లు వ‌సూలు చేసింది 200 కోట్లు వ‌సూలు చేసింది అంటూ నిర్మాత‌లు లెక్క‌లు చెబుతున్నారు. అయితే అంత పెద్ద మొత్తాల‌కు ట్యాక్స్(జీఎస్టీ) క‌ట్టారా? అంటే మాత్రం ఎలాంటి స‌మాధానం ఉండ‌దు. జీఎస్టీ విధానంతో సినీఇండ‌స్ట్రీలో ప‌న్ను దొంగ‌ల్ని ప‌ట్టేస్తార‌ని అంతా మాట్లాడుకున్నారు. అయితే అది నిజ‌మా? అని ప్ర‌శ్నిస్తే అంతా ఉత్తుత్తే అని సౌండ్ విన‌బ‌డుతోంది. ఇక్క‌డ ఎవ‌రూ ఏదీ ఓపెన్ గా చెప్ప‌రు. ఆర్టిస్టుల పారితోషికాల నుంచి సినిమా క్ర‌య‌విక్ర‌యాల్లో రాబ‌డిపై క‌ట్టాల్సిన ప‌న్నుల వ‌ర‌కూ ఏదీ నిజాయితీగా జ‌ర‌గ‌ద‌న్న విశ్లేష‌ణ మ‌రోసారి వేడెక్కిస్తోంది. జీఎస్టీ అధికారులు సైతం లోపాయీ కారీగా వ్య‌వ‌హ‌రిస్తూ సినిమావోళ్ల‌కే సాయం చేస్తార‌న్న వాద‌నా మ‌రోవైపు ఫిలింఛాంబ‌ర్ వ‌ర్గాల్లో వాడి వేడిగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఒక సినిమాకి 100 కోట్ల షేర్ వ‌సూలైతే ఎంత జీఎస్టీ చెల్లించాలి? అంటే .. ఒక హీరోకి 10-20 కోట్ల పారితోషికం అందుకుంటే ఎంత జీఎస్టీ చెల్లించాలి? లెక్క‌లు తీస్తే క‌ళ్లు భైర్లు క‌మ్మేస్తాయ‌ని ఆయ‌న విశ్లేషించారు.

మ‌రి అలాంట‌ప్పుడు 100 కోట్ల షేర్ వ‌సూలు చేసింద‌ని చెబుతున్న ఓ అగ్ర హీరో సినిమాకి ఎంత ప‌న్ను చెల్లించిన‌ట్టు? 18 శాతం నుంచి 30 శాతం వ‌ర‌కూ జీఎస్టీ పేరుతో బాదేస్తున్నారు క‌దా? మ‌రి ఆ మొత్తాన్ని జీఎస్టీ రూపంలో చెల్లించిన‌ట్టేనా? అన్న ప్ర‌శ్న వేశారు ఒక సినీపెద్ద‌. అయితే మీడియా ముందు భ‌జ‌న వేరు.. వెన‌క నుంచి జ‌రిగేది వేరు.. అన్న మాట కూడా ఆయ‌నే చెప్పారు. ఆస‌క్తిక‌రంగా స‌ద‌రు జీఎస్టీ అధికారులు స‌ద‌రు పెద్ద సినిమా ఆఫీస్ లేదా ఇల్లు వెతుక్కుని వ‌స్తే వీళ్లు చెప్పేది కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందిట.

పెద్ద బ‌డ్జెట్ సినిమాలు పేరుతో తొలి వారం టిక్కెట్టు పై బాదుడు షురూ చేయించిన‌ట్టే... ఇంటికొచ్చిన జీఎస్టీ అధికారుల‌కు ``అలా ప్ర‌చారం చేయ‌క‌పోతే థియేట‌ర్ల‌కు ఎవరొస్తారు? అందుకే అలా ప్ర‌చారం చేస్తామ‌ని.. ఒరిజిన‌ల్ లెక్క ఇదీ..`` అని ఏదో కాకి లెక్క చూపిస్తార‌ట‌. వాస్త‌వానికి చెప్పే లెక్క‌కు ఒరిజిన‌ల్ గా వ‌సూలైన దానికి అస్స‌లు పొంత‌నే ఉండ‌ద‌ని ఆయ‌న అన్నారు. గ‌త ఏడాది ఓ రెండు సినిమాల‌కు 200 కోట్ల క్ల‌బ్ అంటూ పోస్ట‌ర్లు వేశారు. అంటే 200 కోట్ల‌కు జీఎస్టీ చెల్లించారా? అంటే అబ్బే అలాంటిదేం లేద‌ని ఒకాయ‌న చెప్ప‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ఇక టిక్కెట్ల బాదుడుపైనా ఓ ఆస‌క్తిక‌ర సంగ‌తిని రివీల్ చేశారాయ‌న‌. ప్ర‌భుత్వం తో క‌లిసి సినిమా జ‌నం ఆడే నాట‌కాల వ‌ల్ల‌నే ప్ర‌భుత్వానికి రావాల్సిన ప‌న్నులు స‌రిగా రావ‌డం లేదని .. ప్రేక్ష‌కుడి చెల్లించిన ప‌న్నులోంచి న్యాయ‌బ‌ద్ధంగా ప‌న్ను రూపంలో ఏదీ గ‌వ‌ర్న మెంట్ కి రాద‌ని తేల్చి చెప్పాడాయ‌న‌.