Begin typing your search above and press return to search.
ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' ఏం జరుగుతోంది
By: Tupaki Desk | 3 May 2022 9:32 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా తో నిరాశ పర్చినా కూడా ఆయన నుండి త్వరలో రాబోతున్న సలార్.. ప్రాజెక్ట్ కే మరియు స్పిరిట్ సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆ సినిమాలు ఉండబోతున్నాయనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే సినిమా విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
గత రెండేళ్లుగా ఈ సినిమా గురించి ఆసక్తికరంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరో ఏడాది పాటు ఈ సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే అంటూ యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. సినిమా వచ్చే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు వస్తుందట. ఎంత ఆలస్యంగా వచ్చినా కూడా ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడి ని సర్ ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయనే నమ్మకంను వారు వ్యక్తం చేస్తున్నారు.
మొన్నటి వరకు ప్రభాస్ విదేశాలకు వెళ్లి వచ్చాడు. ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చిన ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. రామోజీ ఫిల్మ్ సిటీ లో వేసిన భారీ సెట్టింగ్స్ లో ఈ సినిమా షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్ ను నిర్వహించారు. గత షెడ్యూల్ లో దీపిక పదుకునే కూడా పాల్గొన్న విషయం తెల్సిందే.
ఈ షెడ్యూల్ లో ప్రభాస్ మరియు ముఖ్య నటీ నటులు పాల్గొంటున్నారు. ప్రభాస్ లుక్ ఈ సినిమా లో ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతోంది. ఈ సినిమా టైమ్ ట్రావెల్ కథతో నడుస్తుందని అంటున్నారు. విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ కమ్ ఫాంటసీ సినిమా గా ప్రాజెక్ట్ కే ఉండబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
హాలీవుడ్ టెక్నీషియన్స్ పలువురు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. సినిమా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ను ప్రముఖ హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసిన సంస్థలకు అప్పగించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ ఈ సినిమా తో పాన్ ఇండియా స్థాయి నుండి పాన్ వరల్డ్ స్టార్ గా మారిపోయే అవకాశం ఉందంటూ అభిమానులు ధీమా గా ఉన్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ పలు సార్లు ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ సినిమా అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ఇటీవలే విడుదల అయ్యింది. త్వరలోనే ప్రభాస్ నటించిన సలార్ మరియు ఆదిపురుష్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ తర్వాత ప్రాజెక్ట్ కే సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే ప్రాజెక్ట్ కే సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దీపిక పదుకునే టాలీవుడ్ లో మొదటి సారి ప్రాజెక్ట్ కే తో ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.