Begin typing your search above and press return to search.
అలియా-రణబీర్ పై ఇదేం బ్యాటింగ్ బాస్!
By: Tupaki Desk | 30 Jun 2022 7:30 AM GMTరణబీర్ కపూర్-అలియాభట్ తల్లిదండ్రులు కాబోతున్న మాట వాస్తవం. అలియా గర్భం దాల్చిన విషయాన్ని.. ఆసుపత్రిలో స్కానింగ్ రిపోర్ట్ ని సైతం మీడియాకి నేరుగా లీక్ చేసింది. తొమ్మిది నెలలకు అలియా పండంటి పాపాయికి జన్మనిస్తుంది. కపూర్ ఇంట వారసుడో? వారసురాలో? ఎవరో ఒకరు వస్తారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాఓ ప్రచారం చూస్తేంటే! మాత్రం మరీ టూమచ్ గానే అనిపిస్తుంది. అవును.
ఈ దంపతులకి కవల పిల్లలు పడుతున్నారని...ఇద్దరు ఆడపిల్లలు అని కొందరంటుంటే...కాదుకాదు రాక్ స్టార్ లా ఉండే మగ పిల్లలు అంటూ మరికొంత మంది డిస్కషన్ పెట్టడం ఆశ్చర్యకరం. దానికి జ్యోతిష్యులు కూడా తోడవుతున్నారు.
ఓజ్యోతిష్యుడు ఇద్దరు మగ పిల్లలు పుడుతారని..వారు జీవితంలో ఎంతో గొప్ప వారు అవుతారని లింగ బేధం లేకుండా ఆ దంపతులకు పుట్టే బిడ్డలు ఉన్నత స్థానాల్లో ఉంటారని సోషల్ మీడియా సహా వెబ్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది.
ఇంకొంత మంది పండితులు ఒకే ఒక్క ఆడపిల్ల పుడుతుందని.. ఆ పాపాయి రిషీ కపూర్ పోలికల్ని పోలి ఉంటుందని అంచనా వేయడం మొదలుపెట్టారు. ఇలా ఎవరి ఊహాకి అందిన కథనాలు వాళ్లు ప్రచారం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలి కాలంలో ఏ సెలబ్రిటీ గర్భం దాల్చినా ఇలాంటి ప్రచారం తెరపైకి రాలేదు. తొలిసారి ఇద్దరు సెలబ్రిటీలే కావడంతోనే ఈరకమైన ప్రచారానికి ఆజ్యం పోసినట్లు అయింది.
ఇంతకు ముందు కాజల్ అగర్వాల్..ప్రణీత ఇద్దరు బిడ్డలకి జన్మనిచ్చారు. వాళ్ల విషయంలో ఇలాంటి విశ్లేషణలు గర్భంతో ఉన్న తొమ్మిది నెలల సమయంలో ఏనాడు రాలేదు. కానీ అలియాభట్-రణబీర్ పై మాత్రం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి మరీ కథనాలు అల్లడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ కథనాలపై ఈ జంట రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
సాధారణంగా గర్భం దాల్చిన విషయాన్నే పెద్దగా ఎవరూ పబ్లిక్ చేయరు. వీలైనంత వరకూ గోప్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కానీ అలియా-రణబీర్ మాత్రం అంతా ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ఇక బిడ్డ పుడితే ఇంకెంత హడావుడి చేస్తారో. ప్రస్తుతం అలియాభట్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంది. తల్లిదండ్రుల సమక్షంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.