Begin typing your search above and press return to search.
హై-గ్రేడ్ క్యాన్సర్ అంటే ఏమిటి?
By: Tupaki Desk | 5 July 2018 1:20 PM GMTతనకు హై-గ్రేడ్ క్యాన్సర్(మెటాస్టాటిక్ క్యాన్సర్) అని పరీక్షల్లో తేలిందని బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే షాకింగ్ న్యూస్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కొన్నిసార్లు ఊహించని విధంగా జీవితం మనల్ని ఎక్కడికో విసిరేస్తుందని - కొద్ది రోజుల క్రితమే తనకు క్యాన్సర్ సోకినట్లు తేలిందని సోనాలీ చెప్పింది. తనకు క్యాన్సర్ అడ్వాన్స్ డ్ స్టేజీలో ఉందని - క్యాన్సర్ కణాలు శరీరమంతా వ్యాపించాయని తెలిపింది. వైద్యుల సలహాతో న్యూయార్క్ లో చికిత్స పొందుతున్నాననని - తనకు అండగా నిలిచిని కుటుంబసభ్యులు - బంధుమిత్రులు - అభిమానులకు కృతజ్ఞతలని చెప్పింది. తాను క్యాన్సర్ పై పోరాడి విజయం సాధిస్తానని సోనాలీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే నేడు న్యూయార్క్ వెళ్లిన అక్షయ్ కుమార్ ....సోనాలిని కలిసి పరామర్శించారు. ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్లు అక్షయ్ తెలిపారు.
సాధారణ క్యాన్సర్ కు హై-గ్రేడ్ క్యాన్సర్ చాలా వ్యత్సాసం ఉంది. సాధారణంగా క్యాన్సర్ ను నాలుగు స్టేజీలుగా వర్గీకరిస్తారు. మొదటి స్టేజిలో శరీరంలోని ఒక భాగానికి మాత్రమే క్యాన్సర్ సోకుతుంది. రెండో - మూడో స్టేజిలో...ఒక కణం నుంచి మరొక కణానికి క్యాన్సర్ వ్యాప్తి చెందుతుంది. ఇక, నాలుగో స్టేజిలో శరీరంలోని ఒక భాగం నుంచి మరొక భాగానికి క్యాన్సర్ వ్యాప్తి చెందుతుంది. నాలుగో స్టేజీ క్యాన్సర్ ను హై-గ్రేడ్ క్యాన్సర్ అంటారు. దానిని అత్యంత తీవ్రమైన స్టేజీగా వైద్యులు పరిగణిస్తారు. ఈ స్టీజిలో క్యాన్సర్ కణాలు వేగంగా వ్యాప్తి చెందుతాయి. హై-గ్రేడ్ క్యాన్సర్ లో కణాలు ....సాధారణ కణాల కంటే చాలా తేడాగా కనిపిస్తాయి. లో గ్రేడ్ తో పోలిస్తే హై-గ్రేడ్ క్యాన్సర్ కు ప్రత్యేకమైన చికిత్స్ అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సోనాలి బింద్రే...హై-గ్రేడ్ క్యాన్సర్ తో బాధపడుతోంది కాబట్టి ఆమెకు న్యూయార్క్ లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.