Begin typing your search above and press return to search.

జాక్వెలిన్ జాలిగుండె, యానిమల్స్ కోసం ఏం చేస్తోందంటే?

By:  Tupaki Desk   |   7 May 2023 10:28 AM GMT
జాక్వెలిన్ జాలిగుండె, యానిమల్స్ కోసం ఏం చేస్తోందంటే?
X
జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఈ శ్రీలంకన్ బ్యూటీ గురించి తెలియని వారు ఉండరు. ఒకవైపు తన అందంతో సినిమాల్లో, ప్రత్యేక గీతాల్లో అలరిస్తూనే మరోవైపు నిత్యం వార్తల్లో ఉంటూ అందరికీ సుపరిచితం అయింది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు ట్రెండీ ఔట్ ఫిట్ లో తన అందచందాలను ఆరబోస్తుంది. సోషల్ మీడియాలో తన పిక్స్ పోస్టు చేస్తూ ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటుంది.

ఈ బాలీవుడ్ బ్యూటీ చాలా తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. తన అందంతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఎప్పటిలాగా ఈ ఫొట్లోల అందాలు ఆరబోయేలేదీ ముద్దుగుమ్మ. సమాజ సేవ చేసేందుకు ముందుకు వచ్చింది.

ముఖ్యంగా నోర లేని జీవాల కోసం తన వంతు కృషి చేస్తోంది. వేసవికాలంలో నీళ్ల కోసం పక్షులు, జంతువులు పడుతున్న ఇబ్బందిని గుర్తించి... రోడ్డు పై నీటి తొట్టెలను ఏర్పాటు చేసింది. చెట్ల కింద, రోడ్డు పక్కన నీటి తొట్టెలు పొట్టి వాటిలో నీళ్లు పోసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్ స్టా వేధికగా షేర్ చేసింది.

ఇలాంటి నీటి తొట్టెలు ఏర్పాటు చేయడం వల్ల పక్షులు, జంతువులు వేసవిలో తమ దాహాన్ని తీర్చుకొని హైడ్రేట్ అవ్వకుండా కూల్ గా ఉండేలా చేస్తాయని వివరించింది. ప్రజలందరూ ఇలాంటి నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలని కోరింది. అంతే కాకుండా వాటిని రోజూ కడిగి నీటితో నింపాలని చెప్పింది జాక్వెలిన్.

ఈ వీడియోల్లో జాక్వెలిన్ ఓ ఫ్రాక్ వేసుకొని కనిపించింది. అందులో ఆమె చాలా అందంగా ఉంది. అంతేకాకుండా నీటి తొట్టెలను స్వయంగా ఆమే కడుగుతూ.. నీళ్లు నింపి రోడ్లపక్కన పెట్టింది. జాక్వెలిన్ చేసిన ఈ పోస్టు చూసిన అభిమానులు పెద్ద ఎత్తున లైకులు, షేర్లు, కామెంట్లతో రెచ్చిపోతున్నారు. కేవలం అందమే కాదండోయ్.. అంతుకు మించి మంచి మనసు జాక్వెలిన్ సొంతం అంటూ చెబుతున్నారు. జాక్వెలిన్ జాలి గుండెకు జోహార్లు అంటూ కామెంట్లు చేస్తున్నారు.