Begin typing your search above and press return to search.
ఆ రోజులు పోయాయి
By: Tupaki Desk | 11 March 2019 11:18 AM GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దాదాపు అన్ని సినిమా ఇంస్ట్రీలో కూడా డబ్బింగ్ సినిమాల విడుదల ఉంది. మొన్నటి వరకు కన్నడంలో డబ్బింగ్ సినిమాలపై నిషేదం ఉండే. ఇప్పుడు అక్కడ కూడా జెండా ఎత్తేశారు. దాంతో ఏ భాషలో తెరకెక్కినా కూడా అన్ని భాషల్లో విడుదల చేసే సౌలభ్యం ఉంది. డబ్బింగ్ ఖర్చులు చాలా తక్కువగానే అవుతున్నాయి. దాంతో చిన్నా చితకా సినిమాలను డబ్ చేసి వదలాలని కొందరు భావిస్తున్నారు. ఒకప్పుడు ఒక భాషలో విడుదలై సక్సెస్ అయితే కొన్ని వారాలు లేదా నెలల తర్వాత ఇతర భాషల్లో డబ్ అయ్యేవి. అయినా కూడా డబ్బింగ్ వర్షన్ లు మంచి విజయాన్ని సొంతం చేసుకునేవి.
ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. ఒక సినిమా విడుదలైన రెండు మూడు వారాల్లోనే అమెజాన్ లేదా మరేదైనా ఆన్ లైన్ స్ట్రీమింగ్ సైట్లలో వస్తూనే ఉంది. దాంతో ఇతర భాషల్లో డబ్బింగ్ చేయకుండానే అందరు కూడా ఆన్ లైన్ స్ట్రీమ్ చేసి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో సినిమాను చూస్తున్నారు. దాంతో డబ్బింగ్ చేసి ఆలస్యంగా విడుదల చేస్తే ఆ సినిమా బాగుందనే టాక్ దక్కించుకున్నా పట్టించుకునే దిక్కు ఉండదు. సినిమాలు విడుదలైన వారాల వ్యవధిలోనే ఆన్ లైన్ లో వస్తున్న నేపథ్యంలో డబ్బింగ్ సినిమాల విడుదలను ఆలస్యం చేయడం చాలా పెద్ద తప్పుపని
ఇటీవల తమిళంలో వచ్చిన 'సర్వంతాళమయం' చిత్రంకు అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ రెండు వారాలు ఆడిన తర్వాత ఆన్ లైన్ స్ట్రీమింగ్ లోకి ఆ సినిమా వచ్చింది. ఆ సినిమాపై వచ్చిన పాజిటివ్ టాక్ నేపథ్యంలో తెలుగు వారు కూడా ఆన్ లైన్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూశారు. దాంతో తెలుగులో డబ్ అయ్యి విడుదలైన సినిమాను ఎవరు కూడా చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. డబ్బింగ్ సినిమాలు ఒరిజినల్ వర్షన్ తో పాటు విడుదల చేస్తేనే ఏమైనా గిట్టుబాటు ఉంటుంది. ఆలస్యం విడుదల చేస్తే అంతే సంగతులు. రెండు వారాల క్రితం విడుదలైన విశ్వాసం మరియు అంజలి సిబిఐ చిత్రాల పరిస్థితి కూడా ఇదే. అక్కడ విడుదలైన చాలా రోజులకు తెలుగులో రావడంతో పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం నిల్. దీన్ని బట్టి ఆన్ లైన్ స్ట్రీమింగ్ లో వచ్చిన సినిమాలను డబ్ చేసి విడుదల చేయడం పెద్ద తప్పు, అది ఒక వృదా ప్రయాసా అని తెలుసుకోవాలి.