Begin typing your search above and press return to search.
ఇంతకీ సరిలేరు టైటిల్ రెస్పాన్స్ ఏంటి ?
By: Tupaki Desk | 31 May 2019 11:13 AM GMTమహేష్ బాబు 26వ సినిమాగా షూటింగ్ ప్రారంభానికి ముందే టైటిల్ ఫిక్స్ చేసుకున్న సరిలేరు నీకెవ్వరు మీద సోషల్ మీడియాతో పాటు అభిమానుల్లోనూ మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. నిజానికి ఇంత సాఫ్ట్ టైటిల్ తో మహేష్ చేసిన మూవీ ఒక్కటే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. పొడవులో కూడా దాని తర్వాత ఇప్పుడు ఇదే నిలుస్తుంది. కాని అప్పటికి ఇప్పటికి ప్రిన్స్ ఇమేజ్ లో మార్కెట్ లో చాలా మార్పులు వచ్చాయి.
ఎప్పుడో స్వర్గీయ ఎన్టీఆర్ కంచుకోట సినిమాలో పాట పల్లవిని టైటిల్ గా పెట్టాలన్న ఆలోచన అనిల్ రావిపూడికి ఎలా వచ్చిందో కాని మొత్తానికి దీనికి వచ్చిన డివైడ్ రెస్పాన్స్ ని పాజిటివ్ గా మార్చుకోవాలంటే దానికున్న ఒకే ఒక్క మార్గం కంటెంట్ తో కొట్టడమే. మహేష్ ఈసారి మూడక్షరాల సెంటిమెంట్ కు స్వస్తి చెప్పాడు. మహర్షి దాన్ని బలపరుస్తూ విజయం సాధించినా కథ డిమాండ్ మేరకు అనిల్ టైటిల్ కే మొగ్గు చూపినట్టు ఇన్ సైడ్ టాక్
అనిల్ ఇప్పటిదాకా తీసినవన్నీ మాస్ సినిమాలే. ఎఫ్2తో రూటు మార్చాడు కాని అదీ ఇండస్ట్రీ హిట్టు కొట్టింది. అంతకు ముందు తీసిన మూడు సినిమాలు హీరోయిజంని ఎలివేట్ చేస్తూ ఆయా హీరోలకు మంచి బ్రేక్ ఇచ్చినవి. టైటిల్స్ కుడా చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. దీనికి పూర్తి భిన్నమైన టర్నింగ్ తీసుకున్నాడు. తమ హీరోకు మాంచి మసాలా టైటిల్ పెడతాడు అనుకుంటే ఇలా ట్విస్ట్ ఇవ్వడం ఫాన్స్ కు సైతం కొత్తగా ఉంది.
అయితే వాళ్ళు పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదిని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమయ్యాయని ఇప్పుడీ సరిలేరు నీకెవ్వరు కూడా రిలీజయ్యాక ఇదే సరైన పేరు అనిపిస్తుందని చెబుతున్నారు. పోలిక కరెక్టా కాదా అనేది పక్కన పెడితే అందులో లాజిక్ అయితే ఉంది. ఎలాగూ చాలా ముందుగా అనౌన్స్ చేశారు కాబట్టి రిలీజయ్యే సంక్రాంతి లోపు ఈ టైటిల్ జనం నోళ్ళలో నాని అదే అలవాటైపోతుంది