Begin typing your search above and press return to search.

మరి మంచు మనోజ్‌ ఏం చేస్తున్నట్లు..!

By:  Tupaki Desk   |   24 Jun 2022 9:30 AM GMT
మరి మంచు మనోజ్‌ ఏం చేస్తున్నట్లు..!
X
మంచు ఫ్యామిలీ గతం ఎంతో ఘనం అన్నట్లుగా పరిస్థితి మారింది. మోహన్ బాబు అద్బుతమైన నటుడిగా టాలీవుడ్‌ లో టాప్ స్టార్ గా ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శనీయం అనడంలో సందేహం లేదు. అలాంటి మోహన్ బాబు ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి.. మంచు విష్ణు మరియు మంచు మనోజ్ ల యొక్క సినీ కెరీర్‌ లు గందరగోళంగా ఉన్నాయి.

మంచు విష్ణు వరుసగా ప్లాప్ లు పడుతున్నా కూడా సినిమాలు చేయడం మాత్రం మానడం లేదు. కాని మంచు మనోజ్ మాత్రం ఆయన చివరి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. రెండేళ్ల క్రితం అహం బ్రహ్మాస్మి అనే సినిమాను శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ప్రారంభించాడు. ఒక కాన్సెప్ట్‌ పోస్టర్ ను విడుదల చేయడంతో పాటు సినిమా గురించి చాలా హడావుడి ఆ సమయంలో చేయడం జరిగింది.

సొంత నిర్మాణంలో మంచు మనోజ్ ఆ సినిమా ను చేస్తున్నట్లుగా ప్రకటించాడు. భారీ బడ్జెట్‌ సినిమా అవ్వడం వల్ల మరియు కరోనా వల్ల సినిమా ఆలస్యం అవుతుందని.. ఈ ఏడాది చివరి వరకు సినిమాతో మంచు మనోజ్‌ వస్తాడేమో అంటూ మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో వైష్ణవ్ తేజ్ నాల్గవ సినిమా ప్రకటన రావడంతో అంతా షాక్‌ అవుతున్నారు.

మంచు మనోజ్‌ అహంబ్రహ్మాస్మీ సినిమాకు వైష్ణవ్ తేజ్ నాల్గవ సినిమాకు సంబంధం ఏంటి అంటే రెండు సినిమాలకు కూడా దర్శకుడు ఒక్కడే.. ఆయన శ్రీకాంత్‌ రెడ్డి. అహం బ్రహ్మాస్మీ మొదలు పెట్టాలని ఎదురు చూసి చూసి చివరకు వైష్ణవ్‌ తేజ్ తో సినిమాకు ఆయన రెడీ అయ్యాడట. వైష్ణవ్‌ తో చేస్తున్న సినిమా కథ.. మనోజ్ అహం బ్రహ్మాస్మి కథ ఒక్కటేనా అనేది తెలియాల్సి ఉంది.

రెండు సంవత్సరాలుగా శ్రీకాంత్‌ రెడ్డి ని వెయిటింగ్‌ లో పెట్టి చివరకు మరో సినిమా చూసుకునేలా మంచు మనోజ్ ఎందుకు చేశాడు అనేది ఇప్పుడు ప్రశ్న. గత కొంత కాలంగా మంచు మనోజ్ పర్సనల్‌ లైఫ్‌ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. వైవాహిక జీవితంలో ఇబ్బందుల వల్ల సినిమాలపై మనోజ్ దృష్టి పెట్టలేక పోతున్నాడా అనే చర్చ కూడా మొదలు అయ్యింది.

పర్సనల్‌ ఇష్యూలపై శ్రద్ద మరల్చేందుకైనా వరుసగా సినిమాలు చేసే వారు చాలా మంది ఉన్నారు. మరి మనోజ్‌ కనీసం సినిమాలు కూడా చేయకుండా ఏం చేస్తున్నట్లు అంటూ మీడియా సర్కిల్స్ లో మరియు మంచు ఫ్యాన్స్ లో చర్చలు జరుగుతున్నాయి. ఇంతకు ప్రస్తుతం మంచు మనోజ్ ఎక్కడ ఉంటున్నాడు.. ఆయన గతంలో సినిమాల నుండి తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటనను మెల్ల మెల్లగా నిజం చేయబోతున్నాడా అంటూ మంచు ఫ్యాన్స్ సస్పెన్స్ లో ఉన్నారు.