Begin typing your search above and press return to search.

త‌మిళ‌..మ‌ల‌యాళ‌..హిందీ ప‌రిశ్ర‌మ‌ల‌పై జ‌క్క‌న్న అభిప్రాయ‌మిది!

By:  Tupaki Desk   |   13 Dec 2022 8:36 AM GMT
త‌మిళ‌..మ‌ల‌యాళ‌..హిందీ ప‌రిశ్ర‌మ‌ల‌పై  జ‌క్క‌న్న అభిప్రాయ‌మిది!
X
దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుల్లో రాజ‌మౌళి ఒక‌రిగా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ త‌ర్వాత అత్యంత వేగంగా గ్రేట్ డైరెక్ట‌ర్స్ జాబితాలో స్థానం సంప‌దించిన ద‌ర్శ‌కుడాయ‌న‌. 'బాహుబ‌లి'..'ఆర్ ఆర్ ఆర్' లాంటి సినిమాలు జ‌క్క‌న్నకి అంత‌ర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చిపెట్టాయి. హాలీవుడ్ దిగ్గ‌జ‌లే మెచ్చిన గొప్ప ద‌ర్శ‌కుడిగా నీరాజ‌నాలు అందుకుంటున్నారు.

అవార్డులు...రివార్డుల‌తో ఓ తెలుగు ద‌ర్శ‌కుడు విదేశాల్లో స‌త్తా చాటుతుంటే? అంత‌క‌న్నా భాగ్యం ఇంకేం కావాలి. భ‌విష్య‌త్ లో మ‌రిన్ని వండ‌ర్స్ క్రియేట్ చేస్తార‌న‌డంలో అతిశయోక్తి లేదు. ఇలా జ‌క్క‌న్న ఎదుగ‌ద‌ల చూసి ఓర్వ‌లేని ఎంతో మంది ఉన్నారు. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా అత‌ని పై విషం చిమ్ముతోన్న ప్ర‌య‌త్నం క‌ళ్ల ముందు క‌నిపిస్తూనే ఉంది.

ఇలా ఏడిచే వాళ్లు ఎంత మంది ఉన్నా? జ‌క్క‌న్న వేగాన్ని మాత్రం ఆప‌డం ఎవ‌రిత‌రం కాదు. తాజాగా రాజ‌మౌళి అనే లెజెండ్ భార‌తీయ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో భాగంగా నెల‌కొన్న వివిధ ప‌రిశ్ర‌మ‌లపై త‌న అభిప్రాయాలు పంచుకున్నారు. త‌మిళ‌..మ‌ల‌యాళం ..హిందీ ప‌రిశ్ర‌మ‌ల గురించి ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

ఆకట్టుకునే కథలు చెప్పడంలో మలయాళం సినిమా బెస్ట్ గా క‌నిపిస్తుంది. వాళ్ల సినిమాలు చాలా భిన్నంగా ఉంటాయి. క‌థ చాలా బ‌లంగా..స‌హ‌జంగా ఉంటుంది. ఎలాంటి ప‌రిస్థితుల్లోనైనా అక్క‌డా క‌థ‌లు రాణిస్తాయి. ఇక‌ తమిళ సినిమాకు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న దర్శకులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ల థీయ‌రి కొన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు భిన్నంగా ఉంటుంది.

అలాగే తెలుగు సినిమా కమర్షియల్‌గా ఉంటుంది. మాస్ ప్రేక్షకులకు ఏం కావాలో? తెలుగు సినిమా అర్థం చేసుకుని అందిస్తుంది. ఇక కన్నడ సినిమా గతంలో 3వ లేదా 4వ తరగతిగానే ప‌రిగ‌ణించ‌బ‌డేది. కానీ కేజీఎఫ్.. కాంతారా లాంటి సినిమాలుఆ ఇండ‌స్ర్టీ రూపాన్నే మార్చేసాయి. అద్భుతమైన చిత్రాలతో అక్క‌డ ప‌రిశ్ర‌మ అభివృద్ధి చెందుతోంది'' అన్నారు.

ఇంకా బాలీవుడ్ గురించి మాట్లాడుతూ.. 'కార్పోరేట్ కంపెనీలు సినిమాలపై పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిన తర్వాత బాలీవుడ్ ఆత్మసంతృప్తి చెందుతుంది. అక్క‌డ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే అమ్ముడవుతుందంటే బాలీవుడ్ మేకర్స్‌లో ఆకలి కొరవడిందనిపిస్తుంది . కంపెనీల‌న్ని క్రేజీ కాంబినేష‌న్స్ కోసం ఎదురుచూస్తున్నాయి' అని అన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.