Begin typing your search above and press return to search.

హాలీవుడ్ సినిమాపై జ‌క్కన్న ఏమ‌న్నారంటే?

By:  Tupaki Desk   |   27 Nov 2022 2:30 PM GMT
హాలీవుడ్ సినిమాపై జ‌క్కన్న ఏమ‌న్నారంటే?
X
ద‌ర్శ‌క‌దిగ్గ‌జం రాజ‌మౌళి కొన్ని రోజులుగా అమెరికాలో తిష్ట వేసిన సంగ‌తి తెలిసిందే. `ఆర్ ఆర్ ఆర్` ఆస్కార్ నామినేష‌న్ ప‌నుల్లో భాగంగా అమెరికాకు వెళ్లిన ఆయ‌న సినిమాని ఎలాగైనా నామినేట్ చేయాల‌ని చేయాల్సిన క‌స‌ర‌త్తుల‌న్ని చేస్తున్నారు. అందుకోసం కోట్ల రూపాయ‌లు వ్య‌క్తిగ‌తంగా ఖ‌ర్చు చేస్తున్నారు. ఓ తెలుగు సినిమాకి ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపు ద‌క్కాల‌ని ఆయ‌న ప‌డుతోన్న ఆరాటానికి హ్యాట్సాఫ్‌.

ఇండియ‌న్ సినిమా గా `ఆర్ ఆర్ ఆర్` ఆస్కార్ అందుకుని దేశానికే గ‌ర్వ‌కార‌ణంగా కావాల‌ని ఎంతో శ్రమిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో దొరికిన ఏ వేదిక‌ని విడిచిపెట్ట‌డం లేదు. వీలైనంత‌గా ఆర్ ఆర్ ఆర్ కి అన్నిర‌కాలుగా బూస్టింగ్ ఇస్తున్నారు. ఇక హాలీవుడ్ ద‌ర్శ‌క‌..నిర్మాత‌ల‌తో జ‌క్క‌న్న స‌మావేశాలు అంతే ఇంట్రెస్టింగ్. ఈనేప‌థ్యంలో ఓ సంద‌ర్భంలో హాలీవుడ్ సినిమా టాపిక్ సైతం ఆయ‌న వ‌ద్ద రావ‌డంతో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

`త‌ప్ప‌కుండా ఓ హాలీవుడ్ సినిమా చేస్తా. కానీ అంత‌కంటే ముందు కొన్ని హాలీవుడ్ సినిమాల్ని స్ట‌డీ చేయాల‌నుకుంటున్నా. వాళ్ల శైలి తెలుసుకోవాలి. మేకింగ్ ప‌రంగా వాళ్లు ఎలాంటి మెథ‌డ్స్ వాడుతున్నారు వంటి విష‌యాల‌పై పూర్తిగా నాలెడ్జ్ ఉండాలి. లేక‌పోతే వారి శైలిలో సినిమాలు చేయ‌డం చాలా క‌ష్టం. మ‌న మేకింగ్ విధానానికి..ఇంగ్లీష్ సినిమాల మేకింగ్ కి చాలా వ్య‌త్యాసం ఉంటుంది. వాటిని చాలా ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలిస్తే త‌ప్ప తెలియ‌దు` అన్నారు.

హాలీవుడ్ సినిమా చేస్తాన‌న్నారంటే? తెలుగు హీరోల‌తోనా? ఇంగ్లీష్ హీరోల‌తోనా అన్న‌ది జ‌క్కన్న క్లారిటీ ఇవ్వ‌లేదు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కి ఇప్ప‌టికే హాలీవుడ్ వెల్క‌మ్ ప‌లికింది. అత‌ను అమెరికాకి వ‌చ్చేస్తే హాలీవుడ్ ద‌ర్శ‌కులు సినిమా చేస్తాన‌ని ప్రామిస్ చేసారు.

ఇప్పుడా ఛాయిస్ రాజ‌మౌళి తీసుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. హాలీవుడ్ టెక్నిక్ లు ప‌ట్టేయ‌డం జ‌క్క‌న్న‌కి పెద్ద ప‌నేం కాదు. ఓ సినిమాకి ప‌నిచేస్తే చాలు అన్నింటిని అవ‌పోశాన ప‌ట్టేస్తారు. హాలీవుడ్ కూడా టాలీవుడ్ హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ లు చేయ‌గ‌ల ఘ‌నాపాటే అన్న సంగ‌తి గుర్తుంచుకోవాలి హాలీవుడ్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.