Begin typing your search above and press return to search.
చైతు సామ్ ల ప్లాన్ ఏమిటో ?
By: Tupaki Desk | 13 April 2019 6:54 AM GMTమజిలీ సక్సెస్ ని అక్కినేని జంట బాగా ఎంజాయ్ చేస్తోంది. రెండేళ్లుగా సక్సెస్ కు దూరమైన భర్తకు హిట్ దక్కడంలో తన పాత్రా ఉన్నందుకు సామ్ హ్యాపీగా ఉండగా తన మార్కెట్ ని నిలబెట్టిన మూవీ చేసినందుకు చైతు ఫుల్ జోష్ మీదున్నాడు. సామ్ కు డబుల్ బొనాంజా దక్కింది. తమిళ్ లో ఛాలెంజ్ గా తీసుకుని చేసిన సూపర్ డీలక్స్ లోని పాత్ర క్రిటిక్స్ తో కూడా శెభాష్ అనిపించుకుంది.
ఇలా రెండు పక్కలా జాక్ పాట్ కొట్టడంతో సమంతా అభిమానుల ఆనందం గురించి చెప్పేదేముంది. ఇంకొద్ది రోజులు ఆగితే ఓ బేబీ కూడా వచ్చేస్తుంది. అందులోనూ విభిన్నమైన పాత్రే. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన స్టిల్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది
ఇదంతా బాగానే ఉంది కానీ సామ్ కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదు. అలా అని ఆఫర్స్ లేక కాదు. దర్శక నిర్మాతలు వస్తూనే ఉన్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటానని ఆ మధ్య సామ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. నిజంగా అదే కారణమా లేక ఇంకేదైనా అంటూ ఫాన్స్ లో చర్చ మొదలైంది. ఎలాగూ పెళ్ళై ఏడాది దాటింది కాబట్టి అక్కినేని నాలుగో తరం కోసం ఏదైనా ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉండొచ్చనే టాక్ కూడా ఫిలిం సర్కిల్స్ లో ఉంది.
ఇప్పటికిప్పుడు అలాంటి ఆలోచన లేదని సామ్ ఇటీవలే చెప్పింది. సో ఇప్పుడు ప్రచారంలోకొచ్చిన వార్త నిజామా కాదా అనేది చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ఈ రెండు నెలల్లో ఒకటి రెండు సినిమాలు ఒప్పుకుంటే కనక అక్కినేని జంటకు ఆ ఆలోచన లేదని నిర్ధారణకు రావొచ్చు. లేదూ గ్యాప్ తీసుకున్నారు అంటే అది ఎందుకో చైతు సామ్ లే చెప్పాలి