Begin typing your search above and press return to search.

సైరా ఎక్క‌డ ఏమిటి స‌న్నివేశం?

By:  Tupaki Desk   |   3 Oct 2019 5:34 AM GMT
సైరా ఎక్క‌డ ఏమిటి స‌న్నివేశం?
X
ఒకేరోజు మూడు భారీ చిత్రాలు ఇండియాలో రిలీజ‌య్యాయి. సైరా-తెలుగు.. వార్-హిందీ.. జోక‌ర్-హాలీవుడ్.. ఈ మూడూ క్రేజీగా విడుద‌ల‌య్యాయి. మూడింటికి పాజిటివ్ టాక్ రావ‌డం తో `సైరా-న‌ర‌సింహారెడ్డి` స‌న్నివేశ‌మేంటి? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ మూడు సినిమాలు క‌లిపి దేశ‌వ్యాప్తంగా 150-200కోట్ల మేర మొద‌టిరోజు గ్రాస్ వ‌సూలు చేసి ఉంటాయ‌ని అంచ‌నా వెలువ‌డింది. ఇందులో సైరాకు 45-50కోట్ల మేర గ్రాస్ ద‌క్కి ఉంటుంద‌న్న‌ది ఓ అంచ‌నా.

హిస్టారిక‌ల్ వారియ‌ర్ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`పై డే వ‌న్ పాజిటివ్ టాక్ వినిపించింది. ఎమోష‌న్- దేశ‌భ‌క్తి జ‌నాల‌కు క‌నెక్ట‌య్యాయ‌న్న మాటా వినిపిస్తోంది. ఇటు ఆడియెన్ అటు క్రిటిక్స్ నుంచి పాజిటివిటీ క‌నిపించింది ఈ సినిమాపై. విమ‌ర్శ‌కుల పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని విమ‌ర్శ‌లు ఉన్నా ఇదో క‌మ‌ర్షియ‌ల్ చిత్రం అని ప్ర‌శంసించ‌డం క‌లిసి రానుంది. జ‌నాల్లోనూ ఈ చిత్రానికి టాక్ బావుంది. అయితే సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీగా వ‌సూళ్ల‌ను తేవాల్సి ఉంటుంది. అందుకు త‌గ్గ‌ట్టు ప్ర‌చారంలో హైప్ తేవాల్సి ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు.

ప్రీ బిజినెస్ లెక్క‌ల ప్ర‌కారం.. తెలుగు రాష్ట్రాల్లో సైరా చిత్రం 116 కోట్ల షేర్ వ‌సూలు చేయాల్సి ఉండ‌గా.. ఇక అమెరికాలో అయితే 20 కోట్లు వ‌సూలు చేయ‌గ‌లిగితేనే అక్క‌డ విజ‌యం సాధించిన‌ట్టు. క‌న్న‌డ‌- హిందీ బెల్టులోనూ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజైంది కాబ‌ట్టి వ‌సూళ్లు ఆ స్థాయిలోనే తేవాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు బాగానే వ‌ర్క‌వుటైంద‌ని.. అలాగే క‌ర్నాట‌క ఫ‌ర్వాలేద‌ని వినిపిస్తోంది. అయితే ఇటీవ‌ల ఓవ‌ర్సీస్ లో మార్కెట్ ప‌రిస్థితి ఏమీ బాలేదు. దీనిని సైరా బ్రేక్ చేస్తుంద‌నే అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే 1 మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ లో చేరిందని ఓ విశ్లేష‌కుడు వెల్ల‌డించారు. అంటే సుమారు 7 కోట్ల వ‌సూళ్లు సాధ్య‌మైన‌ట్టే. ఇదే ఊపు తొలి వీకెండ్ కొన‌సాగాల్సి ఉంటుంది.

అలాగే క‌ర్నాట‌క‌లో సైరాకు అద్భుత‌మైన టాక్ వినిపిస్తోంది. అక్క‌డ క‌న్న‌డ డ‌బ్బింగ్ కి భారీ గానే వ‌సూళ్లు ద‌క్క‌నున్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. తెలుగు వెర్ష‌న్ + క‌న్న‌డ వెర్ష‌న్లను శాండ‌ల్వుడ్ పంపిణీదారుల‌కు 27కోట్లకు కొన్నారు. అందువ‌ల్ల అక్క‌డ భారీ వ‌సూళ్ల‌ను సాధించాల్సి ఉంటుంది. ఇక హిందీ బెల్టులోనే పాజిటివ్ టాక్ వినిపించినా హృతిక్ రోష‌న్ వార్.. హాలీవుడ్ మూవీ జోక‌ర్ నుంచి పోటీ తీవ్రంగా ఉంద‌ని తెలుస్తోంది. అక్క‌డ తాము ఒక‌టి త‌లిస్తే అన్న చందంగా తొలిరోజు పెద్ద రేంజుకు చేర‌లేక‌పోయింద‌ట‌. తొలిరోజు 2కోట్ల నెట్ వ‌స్తుంద‌ని ఆశిస్తే .. ఆ స్థాయిలో వ‌సూళ్లు ద‌క్క‌లేద‌ని తెలుస్తోంది. ఇక హిందీ బెల్టు స‌హా త‌మిళ‌నాడులో స్థానిక బ‌య్య‌ర్ల సాయంతో కొణిదెల సంస్థ సొంతంగా రిలీజ్ చేసింద‌న్న ప్ర‌చారం ఉంది. అందుకే ఆ రెండు చోట్లా భారీ గా వ‌సూళ్లు ద‌క్కించుకోవాల్సి ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మొద‌టి రోజు సైరా ఎంత వ‌సూలు చేసింది అన్న‌ది క్లియ‌ర్ క‌ట్ గా తేలాల్సి ఉందింకా. గాంధీ జ‌యంతి మొద‌లు ద‌స‌రా సెల‌వులు ఈ సినిమాకి ప్ల‌స్ కానున్నాయి.