Begin typing your search above and press return to search.
వీడియో: ఇంతకీ తాప్సీ వాగ్వాదం దేనికి?
By: Tupaki Desk | 10 Aug 2022 5:26 AM GMTఒక్కోసారి ఈవెంట్లలో రసాభాస సహజం. స్టార్లు ఆలస్యంగా వచ్చారని మీడియా అలకబూనడం లేదా మీడియా సరిగా కవర్ చేయలేదని స్టార్లే అలకబూనడం వగైరా వగైరా ఎపిసోడ్లు నిత్యం చూసేవే. వద్దని వారించినా ఫోటోలు తీసినా.. వీడియో షూట్ చేసినా కొందరు స్టార్లు చిర్రెత్తిపోతుంటారు. మేకప్ లేదని లేదా ఆరోజు మూడ్ లేదని వారించినా ఫోటోగ్రాఫర్లు తమ పని తాము చేసుకుని పోవడం నచ్చదు. మీడియాతో స్టార్ల అవినాభావ సంబంధంలో కోపతాపాలున్నా భార్యాభర్తల్లా సర్ధుకుపోవాలి. కలిసి మెలిసి ఉండాలి.
కానీ ఇక్కడ తాప్సీ ఎంతగా వాదిస్తోందో చూశారు కదా! ఫోటోగ్రాఫర్లు తాప్సీని ఫోటోషూట్ కోసం ఆహ్వానిస్తే ఇలా వాగ్వాదానికి దిగిన వైనం బయటపడింది. తాప్సీ తదుపరి చిత్రం 'దొబారా' ప్రమోషన్ లో బిజీగా ఉంది. నిన్న రాత్రి ఆమె ఫోటోగ్రాఫర్లతో వాగ్వాదానికి దిగింది. ఈవెంట్ ఇండోర్ వేదిక వద్దకు వెళ్లే ముందు తాప్సీ ఫోటోగ్రాఫర్ల కోసం ఆగలేదు. ఫోటోగ్రాఫర్లలో ఒకరు ఆమె కోసం చాలా గంటలు వేచి చూశారు.
దాంతో ఫోటోల కోసం ఎందుకు ఆగడం లేదని అడిగారు. ఆమె తప్పు తనది కాదని ఈవెంట్ కి టైమ్ అయిపోయిందని వాగ్వాదానికి దిగింది. మీడియాని వెయిట్ చేయాలని తాప్సీ కోరారు. అయితే తాప్సీ తనతో గౌరవప్రదంగా మాట్లాడాలని కూడా మీడియా ఫోటోగ్రాఫర్లను కోరింది. అడిగిన సమయానికి ప్రచార కార్యక్రమాలకు వస్తాను.. ఆ కెమెరాలను అటు తిప్పండి.. అని కూడా అంది.
మొత్తానికి ఫోటోగ్రాఫర్లు కూడా తాప్సీ వాదన విని చివరికి తనది తప్పు కాదని అంగీకరించారు. కానీ గంటల కొద్దీ సమయం వేచి చూసినందుకు సహకరించాలని కోరారు. ఇతర ఫోటోగ్రాఫర్లు కూడా ఆమెను ప్రశ్నించగా ఆమె వ్యంగ్యంగా స్పందిస్తూ.. ''మీరే ఎప్పుడూ కరెక్ట్ .. నటీనటులదే ఎప్పుడూ తప్పు. దయచేసి ఇప్పుడే ఫోటోలు తీయండి'' అని అంది. అక్కడి వాలకం చూస్తుంటే తాప్సీ ఫోటోషూట్ కోసం పోజులివ్వడానికి నిరాకరించిందని అర్థమవుతోంది.
ఓవరాల్ గా ఫోటోగ్రాఫర్లతో జరిగిన వాగ్వాదం మరీ అంత ప్రాబ్లెమాటిక్ అయితే కాదు. వారితో తాప్సీ తిరిగి సన్నిహితంగా కలిసిపోయేంత చాణక్యం ప్రదర్శించారు. బాలీవుడ్ లో సోలో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి తానే సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగింది. ఒక చిన్న ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీని నిర్వహించిన తాప్సీ పన్ను ఇప్పుడు అగ్ర నిర్మాతగా ఎదగాలని ప్లాన్ లో ఉంది. కథానాయికగానూ క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది.
కంగనతోనూ వాగ్వాదం..!కంగనా రనౌత్ వర్సెస్ తాప్సీ వైరం గురించి తెలిసిందే. పాము - ముంగిస లా ఎదురెదురు పడితే ఇరువురి నడుమా ఘర్షణ తప్పదు. మొన్నటి గొడవలో ఆ ఇద్దరి కామన్ ఫ్రెండ్ కం నిర్మాత ఏక్తా కపూర్ రెడీ అయ్యింది కానీ చాలా పెద్ద క్లాష్ తప్పేది కాదు. ఆ ఇద్దరూ చాలా సందర్భాల్లో సోషల్ మీడియా ల్లో బిగ్ ఫైట్ కి దిగారు. ఒకరినొకరు కాపీ క్యాట్ అంటూ దెప్పి పొడుచుకున్నారు. శాస్తి కాపీ అంటూ ఒకరినొకరు తిట్టుకోవడం చర్చనీయాంశమైంది. తాప్సీ పన్ను నటించిన 'దోబారా' ట్రైలర్ విడుదల కాగా...దానిపైనా కంగన సెటైర్ వేసింది. కంగనా గొంతెత్తి తాప్సీని 'శాస్తి కాపీ' అని కామెంట్ చేయడంపైనా తాప్సీ రివర్స్ కౌంటర్లు వేసింది. రకరకాల కారణాలతో తాప్సీ పేరు ఇటీవల వివాదాల్లోకొస్తోంది.