Begin typing your search above and press return to search.
RRR తర్వాత ఆ సెంటిమెంట్ సంగతేంటి?
By: Tupaki Desk | 1 April 2022 4:30 AM GMTదర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అపజయమెరుగని వాడిగా వెలిగిపోతున్నాడు. ఇన్నేళ్లలో అతడు తెరకెక్కించిన సినిమాలన్నీ విజయాలు సాధించాయి. అయితే అతడితో పని చేసిన స్టార్ హీరోలు మాత్రం ఆ తర్వాత ఫ్లాప్ లు అందుకున్నారు.
అయితే ఒక సెంటిమెంట్ టెన్షన్ ఇప్పుడు RRR హీరోల అభిమానులను వెంటాడుతోంది. సాధారణంగా మన హీరోలు రాజమౌళి సినిమా చేసిన తర్వాత ఫ్లాప్ అవుతుంటారు. కొన్నేళ్లుగా ఇదే ట్రెండ్. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ పలు ఫ్లాప్ లు అందుకున్నాడు.
యమ దొంగ తర్వాత కూడా అదే పరిస్థితి. మగధీర తర్వాత చరణ్ ఆరెంజ్ తో డిజాస్టర్ అయ్యాడు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ సాహో- రాధే శ్యామ్ సినిమాలు చేశాడు. ఆ రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఇప్పుడు ఈ సెంటిమెంట్ చరణ్.. ఎన్టీఆర్ ల అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
అయితే ఆ ఇద్దరూ దీనిని అధిగమిస్తారా? అంటూ రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. ఆర్.ఆర్.ఆర్ తో బంపర్ హిట్టందుకున్న జోష్ లో ఉన్నాడు రామ్ చరణ్. తన తదుపరి చిత్రాన్ని శంకర్ లాంటి క్రేజీ డైరెక్టర్ తో మినిమం గ్యారెంటీ ఉన్న దర్శకుడితో చేస్తున్నాడు. ఇక బాహుబలితో అమాంతం ప్రభాస్ కి వచ్చినంత క్రేజ్ ఆర్.ఆర్.ఆర్ తారలకు రాలేదు. ఇది కూడా వారికి ప్లస్ కానుంది.
మరోవైపు ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేస్తున్నాడు. రాజమౌళి తర్వాత కొరటాల కూడా అపజయమెరుగని దర్శకుడిగా వెలిగిపోతున్నారు. కొరటాల వంద శాతం సక్సెస్ రికార్డ్ కలిగి ఉన్నారు.
దీంతో తారక్ కి ఆయన ఒక మాంచి హిట్టిస్తారనే అభిమానులు భావిస్తున్నారు. జక్కన్నతో హీరోల సెంటిమెంట్ ని ఈసారి ఆ ఇద్దరూ అధిగమిస్తారనే అంతా ఆశిస్తున్నారు.