Begin typing your search above and press return to search.
పుష్ప టీజర్ బడ్జెట్ ఎంతంటే..?
By: Tupaki Desk | 13 Dec 2022 3:53 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్న పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ మొత్తనికి మొదలయ్యింది. అసలైతే రెండు నెలల క్రితమే ఈ సినిమా షూటింగ్ మొదలు కావాలి. కానీ వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల పుష్ప మొదటి భాగాన్ని రష్యన్ లాంగ్వేజ్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక దాని ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ కూడా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది.
ఇక ఇప్పుడు ఫ్రెష్ గా సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేశారు. అయితే మొదట ప్రత్యేకంగా టీజర్ కోసం షూటింగ్ మొదలుపెట్టడం విశేషం. సాధారణంగా ఒక సినిమా షూటింగ్ మొదలైతే కొంతకాలానికి ప్రత్యేకంగా అందులోని మేజర్ షాట్స్ తీసుకుని టీజర్ రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అలబెటి ట్రెండ్ కాదు. ప్రత్యేకంగా టీజర్ కోసం కూడా షూటింగ్ చేస్తున్నవారు ఉన్నారు.
ఇక సుకుమార్ కూడా అదే తరహాలో టీజర్ షూట్ ను పూర్తి చేయడం విశేషం. అందుకోసం మైత్రి మూవీ మేకర్స్ ఊహించిన విధంగా రూ.3 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. కేవలం టీజర్ కోసమే ఈ రేంజ్ లో ఖర్చు చేయించారు అంటే సినిమా షూటింగ్ కోసం సుకుమార్ ఇంకా ఏ రేంజ్ లో బడ్జెట్ కేటాయించాడో ఊహలకు అందడం లేదు. తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుంది అని భావనతోనే ఈసారి బడ్జెట్ చాలా పెరిగిపోతుంది.
ఇక గ్లిమ్స్ టీజర్ అయితే అవతార్ 2 సినిమా రిలీజ్ సమయంలో ఇండియన్ థియేటర్స్ లో విడుదల చేస్తారని ఇదివరకే ఒక టాక్ వచ్చింది. అయితే షూట్ ఆలస్యమైంది అని అలా విడుదల అయ్యే అవకాశం లేకపోవచ్చు అని కూడా మరొక టాక్ వినిపించింది.
ఏదేమైనా కూడా చిత్ర యూనిట్ మాత్రం మొదట వీలైనంత త్వరగా ఫస్ట్ లుక్ టీజర్ ను మాత్రం విడుదల చేయాలని ఆలోచిస్తుంది. అందుకే భారీ స్థాయిలో మూడు కోట్లు ఖర్చుపెట్టి మరి త్వర త్వరగా ఫినిష్ చేశారు. మరి త్వరగా ఫినిష్ చేసిన ఈ కాస్ట్లీ టీజర్ కంటెంట్ పరంగా ఎంతవరకు మెస్మరైజ్ చేస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.