Begin typing your search above and press return to search.
ఖాన్ ల తర్వాత మన ప్రభాస్ కే ఆ ఛాన్స్?
By: Tupaki Desk | 8 Nov 2020 5:15 AM GMTఅమితాబ్ ఓల్డ్.. షారూక్ కి ఏజ్ 50 దాటిపోయింది.. పైగా సక్సెస్ కనిపించడం లేదు. సల్మాన్ కూడా ఇంకొద్దిరోజులే.. అమీర్ ఖాన్ లో ముసలితనం బయటపడుతోంది.. ఏడాదికి ఒక సినిమా అయినా కష్టమే.. ఇక ఖాన్ ల త్రయం కాక అక్షయ్ .. హృతిక్ లాంటి హీరోలది సపరేట్ రూటు..
వీళ్లంతా అయిపోతే నెక్స్ట్ పాన్ (ఇండియా) వరల్డ్ రేంజు ఎవరికి? ఉంటుంది? అన్నది ఆరా తీస్తే.. సౌత్ నార్త్ రెండు చోట్లా టిప్పర్ లారీతో గుద్దేసే సత్తా మన బుజ్జిగాడికే ఉందన్నది ఓ విశ్లేషణ.
ఖాన్ ల తర్వాత ఆ రేంజు స్టార్ ... మన ప్రభాసేనా? అన్నది ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏజ్ పరంగా.. అప్పీల్ పరంగా చూస్తే ప్రభాస్ కి అన్నీ ప్లస్ లే. అతడి ప్లానింగ్ చూస్తుంటే ఇప్పట్లో తగ్గేట్టే లేడు. వరుసగా పాన్ వరల్డ్ (ఇండియా) సినిమాల్ని మాత్రమే ప్రకటించి అటు హిందీ అభిమానుల్ని ఆకర్షిస్తున్నాడు. నాగ్ అశ్విన్.. ఓం రైత్ (ఆదిపురుష్ 3డి) భారీ పాన్ ఇండియా సినిమాలు. రాధేశ్యామ్ పాన్ ఇండియా రేంజులో రిలీజవుతోంది. తదుపరి యష్ రాజ్ సంస్థలో ధూమ్ 4లో నటించేందుకు ఆస్కారం లేకపోలేదని కథనాలొస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఖాన్ ల ప్రభ మసకబారుతున్న ఇలాంటి సందర్భంలో మన ప్రభాస్ తెలివైన ఎత్తుగడలతో ముందుకెళుతున్నాడనే అర్థమవుతోంది.
ప్రతిభ ఎంతగా పుట్టుకొచ్చినా గొప్పగా ప్రపంచం కళ్లు తిప్పి చూసే స్టామినాని ప్రదర్శించడం అందరికీ సాధ్యం కాదు. ఆరున్నర అడుగుల ప్రభాస్ రాజు విగ్రహానికి ప్రపంచ ఆడియెన్ పట్టంగడుతున్నారు. అందుకే అతడి రేంజ్ ఆ స్థాయికి చేరుకుంటోందని అర్థం చేసుకోవాలి.
బాలీవుడ్ కుర్రహీరోలు లేరా అంటే.. ప్రతిభ పీక్స్ లో ఉన్నా మన ప్రభాస్ రాజు స్టామినా రేంజు కనిపించడం లేదు.. వరుణ్ ధావన్.. విక్కీ కౌశల్ .. సిద్ధార్థ్ మల్హోత్రా వీళ్లంతా అసాధారణ ఫాలోయింగ్ ఉన్న నవతరం స్టార్లు. అయితే పెద్ద రేంజుకు ఇంకా ఎదిగేందుకు కొంత సమయం పట్టొచ్చు.
అలాగే ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్ .. చరణ్ .. బన్ని వీళ్లు కూడా పాన్ ఇండియా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సౌత్ నుంచి ఆ రేంజులో వీళ్లంతా ఊపుతారా? అన్నది చూడాలి.