Begin typing your search above and press return to search.
పఠాన్ రెమ్యూనరేషన్ అంతేనా.. అడ్వాన్స్ బుకింగ్స్ పరిస్థితి ఏంటీ?
By: Tupaki Desk | 21 Jan 2023 2:30 AM GMTబాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జీరో సినిమా తో బాద్ షా జీరో అయ్యాడు అంటూ విమర్శలు చేసిన వారికి సమాధానంగా పఠాన్ సినిమాను చేస్తున్నట్లుగా షారుఖ్ ఖాన్ చెప్పకనే చెబుతూ వచ్చాడు.
పఠాన్ సినిమాపై ఉన్న నమ్మకం మరియు తన మార్కెట్ ఇతర విషయాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలను రిస్క్ లో పెట్టకుండా షారుఖ్ ఖాన్ కేవలం 35 నుండి 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. లాభాల్లో మెజార్టీ వాటాను తీసుకునేలా ఒప్పందం చేసుకున్నాడని కూడా సమాచారం అందుతోంది.
ఇక సినిమాను దాదాపుగా 250 కోట్ల బడ్జెట్ తో రూపొందించినట్లుగా తెలుస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ లో ఈ సినిమా భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందింది. ఈ సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. దేశవ్యాప్తంగా పలు కారణాల వల్ల పఠాన్ ను బహిష్కరించాలి అంటూ పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.
ఒక వైపు బాయ్ కాట్ నినాదం ట్రెండ్ అవుతున్నా కూడా మరో వైపు పఠాన్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో జరుగుతోంది. ఇటీవల మల్టీ ప్లెక్స్ ల్లో పఠాన్ యొక్క అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయ్యింది. అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయిన 24 గంటల్లోనే 1,75,000 టికెట్లు అమ్ముడు పోయినట్లుగా సమాచారం అందుతోంది.
మొదటి 24 గంటల్లో అమ్ముడు పోయిన టికెట్లలో 1.17 లక్షల టికెట్లు మొదటి రోజు షో ను చూసేందుకు బుక్ అయినవే. సినిమా విడుదలకు మరో అయిదు రోజుల సమయం ఉంది. కనుక అడ్వాన్స్ బుకింగ్ కౌంట్ 5 లక్షల వరకు చేరే అవకాశాలు ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ నిపుణులు చెబుతున్నారు.
కేజీఎఫ్ 2 సినిమా కు విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 5 లక్షల టికెట్లు అమ్ముడు పోయాయి. బ్రహ్మాస్త్ర సినిమాకు దాదాపుగా మూడు లక్షల టికెట్లు విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అమ్మడు పోయాయి. ఇప్పుడు పఠాన్ అన్ని రికార్డులను తిరగరాసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
షారుఖ్ ఖాన్ కు జోడీగా ఈ సినిమాలో దీపికా పడుకునే నటించిన విషయం తెల్సిందే. ఆమె బికినీ వివాదం సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ భారీ ఎత్తున అయ్యే విధంగా కూడా చేసింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ రేంజ్ లో సినిమా ఉంటుందా అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.