Begin typing your search above and press return to search.

సోమవారం నుండి థియేటర్లు పరిస్థితి ఏంటి ?

By:  Tupaki Desk   |   23 Jan 2022 1:44 PM GMT
సోమవారం నుండి థియేటర్లు పరిస్థితి ఏంటి ?
X
గ‌డిచిన రెండేళ్లుగా థియేట్రిక‌ల్ రంగం పూర్తిగా కుదేలైంది. క‌రోనా మ‌హ‌మ్మారీ ఓ వైపు టెన్ష‌న్ పెడుతుంటే ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు మ‌రింత‌గా టెన్ష‌న్ ని పెంచాయి. ఏపీలో టికెట్ ధ‌ర‌లు గిట్టుబాటు కాని వ్య‌వ‌హారంగా మారింది. దీంతో ఈ సంక్రాంతి బ‌రిలో క్రేజు ఉన్న సినిమాలేవీ రిలీజ్ కి రాలేదు. ఓమిక్రాన్ విజృంభ‌ణ కొన‌సాగుతున్నా మ‌ర‌ణ భ‌యం లేదు కాబ‌ట్టి.. వ‌రుస రిలీజ్ ల‌కు ఇబ్బందేమీ ఉండ‌ద‌ని భావించారు. కానీ ఇప్పుడు సీన్ అలా లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విడుదలలకు ఇబ్బందిక‌ర‌మైన స‌న్నివేశం ఉందిప్పుడు. యాభై శాతం ఆక్యుపెన్సీ నైట్ కర్ఫ్యూల‌ కారణంగా థియేటర్ నిర్వాహ‌ణ‌కు ఇబ్బందిక‌ర స‌న్నివేశం త‌లెత్తింది. కార్మికుల‌కు తిండి లేకుండా పోతోంది. సోమవారం అంటే రేపటి నుండి థియేట‌ర్ల‌ను మూసివేయవలసి వ‌స్తోంద‌ని తెలిసింది. దేశవ్యాప్తంగా థియేటర్ల బిజినెస్ చాలా ముందుగానే మూతపడగా సంక్రాంతి సీజన్ కారణంగా ఏపీ తెలంగాణల్లో ఆలస్యమైంది. సంక్రాంతి బ‌రిలో వ‌చ్చిన బంగార్రాజు సేఫ‌వ్వ‌గా.. నాగార్జున‌ కి ఇక ఇప్పుడు అంత ఇబ్బంది కూడా లేదు. ఇక ఇత‌ర సినిమాల్లో ఏవీ క్రేజు ఉన్న‌వి లేక‌పోవ‌డంతో జ‌నం కూడా థియేట‌ర్ల వైపు చూడ‌డం లేదు. ప్ర‌స్తుత కండీష‌న్ లో థియేటర్లను నడపలేమని థియేటర్ యాజమాన్యాలు భావిస్తున్నాయి. కొన్ని థియేటర్లు రోజువారీ నిర్వహణ ఛార్జీలను కూడా పొందలేని ప‌రిస్థితి ఉంది. చెప్పుకోదగ్గ చిత్రాలేవీ లేకపోవడంతో ప్రేక్షకులు కూడా థియేటర్లకు వచ్చే మూడ్ లో లేరు. ఏపీలో టిక్కెట్‌ ధరలు ఆకట్టుకోలేక పోవడంతో అక్కడి థియేటర్లను మూసి వేయాల‌ని యజమానులు భావించార‌ని స‌మాచారం.

ఓమిక్రాన్ స్పీడ్ త‌గ్గేవ‌ర‌కూ కాస్త ఆగితే ఫ‌ర్వాలేదు కానీ థియేట‌ర్లు మ‌ళ్లీ ఎప్ప‌టికి తెరుస్తారు? అన్న‌ది వాళ్లే నిర్ణ‌యించాల్సి ఉంటుంది. కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖి ఈ నెల 28న విడుదల కానుంది. కొన్ని థియేటర్లు తెరిచే వీలుంద‌ట‌. రవితేజ నటించిన ఖిలాడీ ఫిబ్రవరి 12న విడుదలవుతుంది. క్రేజు ఉన్న సినిమా కాబ‌ట్టి అప్ప‌టికి థియేట‌ర్లు ఓపెన్ చేస్తార‌ని భావిస్తున్నారు. క్రైసిస్ వ‌ల్ల తిరిగి తెర‌వ‌క‌పోతే అంద‌రూ ఇబ్బందుల్లో ప‌డ్డ‌ట్టే. మార్చిలోనూ వ‌రుసగా సినిమాలు రిలీజై థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడాలి. లేదంటే ఇక పూర్తిగా థియేట‌ర్ల రంగం మాంద్యంలో కూరుకుపోయిన‌ట్టేన‌ని విశ్లేషిస్తున్నారు.

ఓటీటీతో కొంత ముప్పు..

ఓటీటీలో అఖండ‌-పుష్ప‌-శ్యామ్ సింగ‌రాయ్ స‌హా ప‌లు క్రేజీ చిత్రాలు విడుద‌ల‌య్యాయి. వీటితో జ‌నం బోలెడంత వినోదం పొందుతున్నారు. ఓమిక్రాన్ త‌గ్గేవ‌ర‌కూ థియేట‌ర్ల‌కు వెళ్లాల‌ని అనుకోవ‌డం లేద‌ట‌. అమెజాన్ ప్రైమ్ - నెట్ ఫ్లిక్స్ - ఆహా లో ఒరిజిన‌ల్ కంటెంట్ కి జ‌నం అడిక్ట్ అవ్వ‌డం థియేట‌ర్ల రంగానికి మైన‌స్ గా మారింది.