Begin typing your search above and press return to search.
ప్రభాస్ సినిమా వెనక ఆ డైరెక్టర్ ఇన్ వాల్వ్ మెంట్ ఎంత?
By: Tupaki Desk | 7 Sep 2022 4:30 PM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న మూడు క్రేజీ ప్రాజెక్ట్ లు ప్రస్తుతం చిత్రీకరణ స్టేజ్ లో వున్నాయి. 'కేజీఎఫ్' సిరీస్ చిత్రాలతో దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ 'సలార్' పేరుతో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీని చేస్తున్నారు.
'ఆది పురుష్' పేరుతో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రామాలు జరుపుకుంటోంది. ప్రఖ్యాత టి సిరీస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీని 2023 జనవరి 12న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. వీటితో పాటు ప్రభాస్ ఓ ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ గా రూపొందుతున్న 'ప్రాజెక్ట్ కె'లో నటిస్తున్నారు.
'మహానటి' మూవీతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుతో పాటు పురస్కరాన్ని సొంతం చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా దీపికా పదుకోన్, దిషా పటానీ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
అయితే టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే ఈ ఫిక్షనల్ మూవీకి సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మెంటర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ లో ఆయన ఇన్ వాల్వ్ మెంట్ ఎంత అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 'మహానటి' సినిమా విషయంలోనూ సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు నాగ్ అశ్విన్ కు చూచనలు, సలహాలు ఇచ్చారట. అయితే 'ప్రాజెక్ట్ కె' కు సింగీతం మెంటర్ గా వ్యవహరిస్తున్నారని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది.
దీనిపై సింగీతం శ్రీనివాసరావు తాజాగా స్పందించారు. గత కొన్ని నెలలు ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేసిన సింగీతం ఆ తరువాత మానేశారట. ఇదే విషయాన్ని తాజాగా వెల్లడించారు. స్క్రిప్ట్ విషయంలో నా ఇన్ పుట్స్, ఒపీనియన్ అడిగారు ఇచ్చాను. దాంతో నా జాబ్ పూర్తయింది. నేను ఈ ప్రాజెక్ట్ కు మెంటర్ ని కాదు, షో రన్నర్ ని అంతకంటే కాదు'అంటూ క్లారిటీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.