Begin typing your search above and press return to search.

న‌య‌న్ దంప‌తుల‌పై క‌మిటీ ఫైన‌ల్ గా ఏం తేల్చిందంటే!

By:  Tupaki Desk   |   26 Oct 2022 6:07 PM GMT
న‌య‌న్ దంప‌తుల‌పై క‌మిటీ ఫైన‌ల్ గా ఏం తేల్చిందంటే!
X
న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ కొన్నేళ్ల ప్రేమాయ‌ణం త‌రువాత జూన్ 9న ఇరు కుటుంబాల అంగీకారంతో చెన్నై సమీపంలోని మహాబ‌లేశ్వ‌రంలో వున్న రిసార్ట్స్ లో వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. టాలీవుడ్ క్రేజీ స్టార్స్ అంతా వీరి వివాహానికి హాజ‌ర‌య్యారు. న‌య‌న్ - విఘ్నేష్ దంప‌తుల పెళ్లి వీడియో త్వ‌ర‌లోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలో పెళ్లై నాలుగు నెల‌లు పూర్తి కాకుండా న‌య‌న్ దంప‌తులు త‌మ‌కు ఇద్దరు క‌ల‌వ‌ల పిల్లులు పుట్టార‌ని వెల్ల‌డించి షాకిచ్చారు.

పెళ్లై నాలుగు నెల‌లు తిర‌క్కుండానే పిల్ల‌లు ఏంటీ? ఏంటీ మాయ అంటూ సెల‌బ్రిటీలు, ప్రేక్ష‌కులు, నెటిజ‌న్స్ ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యాయి. దీంతో ఈ జంట క‌వ‌ల పిల్ల‌ల‌పై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది.

స‌రోగ‌సీ విధానం వ‌ల్లే ఈ దంప‌తులు త‌ల్లిదండ్రుల‌య్యారంటూ ప్ర‌చారం మొద‌లైంది. ఇది కాస్తా వైర‌ల్ కావ‌డంతో ప్ర‌భుత్వం న‌య‌న‌తార‌, విఘ్నేష్ దంప‌తుల సంతానంపై విచార‌ణ క‌మిటీని నియ‌మించి విచార‌ణ చేప‌ట్టింది.

దీంతో న‌య‌న అభిమానుల్లో ఆందోళ‌న మొద‌లైంది. కొంత మంది ఇది చ‌ట్ట విరుద్ధం అంటూ కామెంట్ లు చేస్తుంటే నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌య‌న్ దంప‌తులు స‌రోగ‌సీ విధానం వ‌ల్లే సంతానాన్ని పొందివుంటే వారికి శిక్ష త‌ప్ప‌దంటూ మ‌రి కొంత మంది సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేయ‌డం మొద‌లు పెట్టారు. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన క‌మిటీ విచార‌ణ పూర్తి చేసింది.

త‌న నివేదిక‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి అంద‌జేసింది. త‌న నివేదిక‌లో న‌య‌న్ దంప‌తుల స‌రోగ‌సీ చ‌ట్ట‌బ‌ద్ద‌మేన‌ని తేల్చి చెప్పింది. 2021 న‌వంబ‌ర్ లోనే స‌రోగ‌సీ విధానం కోసం అగ్రిమెంట్ జ‌రిగింద‌ని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన క‌మిటీ త‌న విచార‌ణలో స్ప‌ష్టం చేసింది. దీంతో న‌య‌న‌తార దంప‌తుల స‌రోగ‌సీ వివాదానికి తెర‌ప‌డింది. దీంతో న‌య‌న తార అభిమానులు ఊపిరి పీల్చుకుని హర్షాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

సుప్రీం కోర్టు నిషేధించిన స‌రోగ‌సీ విధానంని న‌య‌న‌తార దంప‌తులు ఎలా అతిక్ర‌మించారంటూ నెటిజ‌న్ లు ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో న‌య‌న దంప‌తుల వివాదం వైర‌ల్ కావ‌డంతో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రంగంలోకి దిగింది. దీని వెన‌కున్న అస‌లు నిజం ఏంటో నిగ్గుతేల్చండి అంటూ ప్ర‌త్యేకంగా ఓ క‌మిటీని ఏర్పాటు చేసి విచార‌ణ కు ఆదేశించింది. తాజాగా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం వేసిన విచార‌ణ క‌మిటీ న‌య‌న్ దంప‌తుల స‌రోగ‌సీపై క్లీన్ చిట్ ఇవ్వ‌డంతో వివాదం సుకాంతం అయినట్టుగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.