Begin typing your search above and press return to search.
ఆచార్యకు `గ్యాంగ్ లీడర్` కనెక్షన్ ఏమిటి?
By: Tupaki Desk | 9 Jan 2021 11:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఈ చిత్రంలో 20 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో నటిస్తున్నారు. జనవరి ఎండింగ్ నుంచి ఆయన చిత్రీకరణలో పాల్గొంటారని కథనాలు వినిపిస్తున్నాయి.
దేవాలయ ఆస్తుల కుంభకోణం నేపథ్యంలో సోషియో పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో చిరు సరసన కాజల్ కథానాయికగా నటిస్తోంది. చరణ్ నాయికను ఫైనల్ చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ తేదీపై ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీని ఇవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం.. చిరు-కొరటాల బృందం రిలీజ్ తేదీని లాక్ చేశారని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఈసారి ఆచార్య రిలీజ్ కి మెగాస్టార్ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన నటించిన కల్ట్ క్లాసిక్ హిట్స్ జగదేక వీరుడు అతిలోక సుందరి(1990)- గ్యాంగ్ లీడర్(1991) మే 9న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి. 2021 మే 9న ఆచార్య రిలీజైతే సెంటిమెంటుగా అది వర్కవుట్ అవుతుందని చిరు-కొరటాల బృందం భావిస్తున్నారట. మే9 రిలీజ్ తో హ్యాట్రిక్ కొట్టాలన్న పంతం కనిపిస్తోందట. నాటి క్లాసిక్స్ తో అందుకున్న రిజల్ట్ నే తిరిగి ఆచార్య రిపీట్ చేస్తుందని భావిస్తున్నారట. అయితే ఆ సమయానికి సినిమాని రిలీజ్ చేయాలంటే ఎంతో పకడ్భందీగా చిత్రీకరణను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు కొరటాల ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం.
ఇక ఈ మూవీ కోసం చరణ్ 30 రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం అన్నీ జరిగితే.. చరణ్ పై సన్నివేశాల్ని జనవరి-ఫిబ్రవరిలో పూర్తి చేయాలని కొరటాల భావిస్తున్నారు. మార్చి-ఏప్రిల్ లో నిర్మాణానంతర పనుల్ని పూర్తి చేస్తారు. అలాగే చిరంజీవి ఆచార్యకు.. పవన్ వకీల్ సాబ్ కి మధ్య ఎలాంటి పోటీ లేకుండా నెలరోజుల గ్యాప్ మెయింటెయిన్ చేస్తుండడం ఆసక్తికరం. పవన్ నటించిన వకీల్ సాబ్ ని ఏప్రిల్ 9న రిలీజ్ చేస్తుండగా.. మే9న ఆచార్య రిలీజవుతుండడం ఫ్యాన్స్ లో ఉత్కంఠను పెంచుతుందనడంలో సందేహమేం లేదు. నెలరోజుల గ్యాప్ లోనే రెండు భారీ క్రేజీ చిత్రాలు మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీటివ్వనున్నాయి.