Begin typing your search above and press return to search.
తేజ మాటల వెనకున్న నిగూఢ అర్థం ఏంటీ?
By: Tupaki Desk | 16 Nov 2022 5:41 AM GMTతేజ.. టాలీవుడ్ లో ఈ దర్శకుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడటం.. నచ్చని విషయాన్ని సూటిగా చెప్పడం ఈయన నైజం. సినిమాటోగ్రాఫర్ గా పలు క్రేజీ సినిమాలకు పని చేసిన తేజ ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించిన 'చిత్రం' సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ ని ఆయన హీరోగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. తొలి చిత్రంతో యూత్ ని ఎట్రాక్ట్ చేసిన తేజ అదే స్థాయిలో దర్శకుడిగా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు.
ఇదే మూవీతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్ కు కూడా ఇదే స్థాయికి మించి పాపులారిటీ దక్కింది. వీరిద్దరి కలయికలో బ్యాక్ టు బ్యాక్ మూడు బ్లాక్ బస్టర్ హిట్లు వచ్చాయి. ఆ తరువాత ఉదయ్ కిరఫ్ క్రేజ్ అందనంద ఎత్తుకు చేరుకుంది. అయితే ఉన్నట్టుండి ఉదయ్ కిరణఫ్ కెరీర్ డౌన్ ఫాల్ కావడం.. ఆ తరువాత ఇండస్ట్రీలో అవకాశాలు లేక తెరమరుగు కావడం తెలిసిందే. ఈ పరిస్థితిని భరించలేక ఉదయ్ కిరణ్ 2014, జనవరి 5న తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ వార్త ప్రతీ ఒక్కరినీ షాక్ కు గురి చేసింది. యావత్ సినీ ఇండస్ట్రీ ఇక్కిసారిగా తీవ్ర షాక్ కు గురైంది. తన అభిమానులు ఈ వార్తని జీర్ణించుకోలేకపోయారు. యూత్ ఐకాన్ ల జేజేలు అందుకున్న ఉదయ్ కిరణ్ ఆత్మ హత్యకు పూనుకోవడం ఏంటని అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. దీని వెనక ఉదో జరిగిందనే చర్చించడం మొదలు పెట్టారు. కొంత మంది పెద్దల ప్రమేయం కారణంగానే ఉదయ్ కిరణ్ కెరీర్ పతనం అయిందని, అది భరించలేకే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు మొదలయ్యాయి.
తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ ఆత్మ హత్యపై దర్శకుడు తేజ సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఉదయ్ కిరణ్ వరుసగా మూడు బ్లాక్ బస్టర్లని సొంతం ఏసుకున్న తరువాత ఏం చేయాలో.. ఎలా ముందుకు వెళ్లాలో తెలియని అయోమయానికి లోనయ్యాడని, ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పాడన్నారు తేజ.. అకస్మాత్తుగా వచ్ఇన స్టార్ డమ్ ని, ఉన్న పలంగా మొదలైన పతనాన్ని తట్టుకోలేకపోయాడన్నాడు.
తన మరణానికి గల అసలు కారణం ఏంటో తనకు బాగా తెలుసునని, అయితే ఆ విషయాన్ని తాను సమయం వచ్చినప్పుడు మాత్రమే చెబుతానని తేజ వెల్లడించారు. ఇక్కడ తేజ చెప్పిన మరో విషయం 'తన మరణానికి ముందు ఉదయ్ కిరణ్ మరణం వెనకున్న మిస్టరీని తప్పకుండా బయటపెడతానని చెప్పడం' వెనక నిగూఢ అర్థం ఏదో వుందన్న అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తోంది. అంతా అనుమానిస్తున్నట్టే ఉదయ్ కిరణ్ ఆత్మ హత్య వెనక మిస్టరీ వుందా?.. వుంటే ఆ మిస్టరీ వెనక ఎవరున్నారన్నది ఇప్పటికీ సస్పెస్సే?.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.