Begin typing your search above and press return to search.

సీత‌మ్మ‌కి లోక‌ల్ బ్రాండ్ అంటేనే మ‌క్కువా?

By:  Tupaki Desk   |   6 Feb 2022 11:32 AM GMT
సీత‌మ్మ‌కి లోక‌ల్ బ్రాండ్ అంటేనే మ‌క్కువా?
X
బాలీవుడ్ హీరోయిన్ అలియాభ‌ట్ `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కి ముందే టాలీవుడ్ లో ఫేమ‌స్ అయిపోతుంది. త‌న‌దైన మార్క్ చ‌లాకీత‌నంతో అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. ఎన్టీఆర్..రామ్ చ‌ర‌ణ్..రాజ‌మౌళి లు మొద‌టి సినిమాతోనే మంచి స్నేహితులు అయిపోయారు.

ఆ కార‌ణంగా యంగ్ టైగ‌ర్ తో మ‌రో సినిమా చేయ‌డానికి కూడా అలియా రెడీ అయిన సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజులుగా అలియాభ‌ట్ తెలుగింట సోష‌ల్ మీడియా యూజ‌ర్ ఖాతాల్లో వైర‌ల్ గా మారుతోంది.

`ఆర్ ఆర్ ఆర్` ప్ర‌మోష‌న్లో పాల్గొన్న నాటి నుంచి అలియా తెలుగు వారికి సోష‌ల్ మీడియా రూపేనా బాగా ద‌గ్గ‌రైపోయింది. తాజాగా ఈ బ్యూటీ ధ‌రించిన బ్లాక్ పాయ‌ల్ ఖండ్ వాలా బ్రాండెడ్ డ్రెస్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.

దీంతో ఆ డ్రెస్ వెనుక ఆరాలు మొద‌ల‌య్యాయి. బెంగుళూరుకి చెందిన మాధుర్య క్రియేష‌న్స్ ఈ డిజైన్ తాయారు చేసింది. మొద‌ట‌గా ఈ సంస్థ ఆభ‌ర‌ణాల డిజైన్ల‌కు ప్ర‌సిద్ది. అయితే ట్రెడిష‌న‌ల్ డిజైన్స్ లో చీర‌లు..గృహ అలంకర‌ణ‌లోనూ ఫేమ‌స్ అవుతోంది. పేరుకు దేశీ బ్రాండ్ అయినా మాధుర్య‌లో షాపింగ్ అంటే చుక్క‌లే. ఆన్ లైన్ లో మాత్ర‌మే విక్ర‌యాలు జ‌రుగుతాయ‌ట‌.

టాప్ మోస్ట్ ల‌గ్జ‌రీయిస్ ప్యాష‌న్స్ బ్రాండ్ పాయ‌ల్ ఖండ్ వాలా ఒక‌టి. సంప్ర‌దాయ అల్లిక‌లు..కుంద‌ర్ వ‌ర్క్స్ తో ల‌భించే ఈ డిజైన్స్ కి విదేశాల్లో గిరాకీ ఎక్కువ‌. విదేశీ డిజైన్స్ క‌న్నా అలియాకి లోక‌ల్ మేడ్ అంటేనే ఎంతో ఇష్ట‌మ‌ని తెలిపింది. చాలా మంది ప్రాన్స్ కి చెందిన ప్రింజ్ ట్రెండ్ అంటే ఇష్ట‌ప‌డ‌తారు. కానీ నాకు ఆ స్ట‌యిల్ పెద్దగా న‌చ్చ‌దు.

అది త‌ప్ప మిగ‌తా ఫ్యాష‌న్ ట్రెండ్స్ అన్ని ఫాలోఅవుతాన‌ని తెలిపింది. ప్ర‌స్తుతం అలియా భ‌ట్ `గంగూబాయి క‌తియావాడి`లో న‌టిస్తోంది . ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా అంచ‌నాలు భారీగా పెరిగాయి.