Begin typing your search above and press return to search.
లుక్ అదేనా? తొందరపడితే ఇంతేగా పవన్ జీ!
By: Tupaki Desk | 14 Feb 2022 4:07 AM GMTఇటీవలి కాలంలో స్టార్ హీరోలంతా బ్యాక్ టు బ్యాక్ స్క్రిప్టుల్ని ఫైనల్ చేస్తూ ఒకదాని వెంట ఒకటిగా పరుగులు పెట్టించేస్తున్నారు. ఒక సినిమా సెట్ నుంచి ఇంకో సినిమా సెట్ కి షఫుల్ అవుతున్నారు. డార్లింగ్ ప్రభాస్ పరిస్థితి ప్రస్తుతం ఇలానే ఉంది. ఓవైపు ఆదిపురుష్ 3డి .. మరోవైపు సలార్ చిత్రీకరణల కోసం అతడు అటూ ఇటూ పరుగులు పెట్టాడు. దీంతో పాటే నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ సినిమాని ప్రారంభించి హైరానా పడుతున్నాడు.
ఇంతకుముందు చరణ్ కూడా ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తూ ఆచార్య సెట్ లో అడుగుపెట్టాడు. అయితే ఇలా నటించేప్పుడు గెటప్ ఛేంజ్ చేయడం అంత ఈజీ కాదు. దానికోసం చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది.
ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం ఒకేసారి ముగ్గురు నలుగురు దర్శకులకు లైన్ క్లియర్ చేసి వేగం పెంచారు. ఆయన రాజకీయ షెడ్యూళ్ల కనుగుణంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వేగంగా సినిమాల్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. ఆయన ఒక సెట్ నుంచి ఇంకో సెట్ కి వెళుతుంటే వేషధారణను మార్చడం అంత సులువుగా లేదు.
ప్రస్తుతం అతడు వీరమల్లు షెడ్యూల్స్ ని పరుగులు పెట్టించే ఆలోచనలో ఉన్నాడు. దానికి కొంత ప్రిపరేషన్ తో ఉన్నాడు. ఇక వీరమల్లు పాత్ర కోసం అతడు పొడవుగా జులపాల జుట్టు పెంచిన సంగతి తెలిసిందే. అయితే చిక్కంతా ఇక్కడే ఉంది. ఇదే గెటప్ తో అతడు భీమ్లా నాయక్ పెండింగ్ చిత్రీకరణలో పాల్గొనడంతో ఆ హెయిర్ స్టైల్ నాన్ సింక్ గా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా భీమ్లా సెట్ నుంచి ఫోటో లీక్ అవ్వడంతో ఇది బయటపడింది.
నిజానికి భీమ్లా నాయక్ షూటింగ్ అంతా పూర్తయింది. పాట చిత్రీకరణలో పాల్గొనేందుకు ఇప్పుడిలా పవన్ రావాల్సొచ్చింది. అయితే పాటలోనే కాబట్టి మ్యానేజ్ చేసేయొచ్చని భావించి ఉండవచ్చు.. అని ఊహిస్తున్నారు.
ఇక సంక్రాంతి బరి నుంచి మిస్సయిన భీమ్లా నాయక్ తొందర్లోనే థియేటర్లలోకి రాబోతున్నాడు. అభిమానులు ఆ ఎగ్జయిటింగ్ క్షణం కోసం వేచి చూస్తున్నారు. ఈలోగానే ఏపీలో టికెట్ రేట్ల లొల్లు తేలాల్సి ఉంటుంది.