Begin typing your search above and press return to search.
కల్యాణ్ రామ్ కాన్ఫిడెన్స్ వెనకున్న మాస్టర్ ప్లాన్ ఏంటీ?
By: Tupaki Desk | 5 July 2022 8:45 AM GMTనందమూరి కల్యాణ్ రామ్ సినిమా థియేటర్లలో సందడి చేసి దాదాపు రెండేళ్లవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన నుంచి వస్తున్న ఫాంటసీ యాక్షన్ మూవీ `బింబిసార`. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తూ ఈ భారీ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా మల్లిడి వశిష్ట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కేథరిన్, సంయుక్త మీనన్, వారినా హుస్సేన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. హీరో కల్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారు.
5వ సెంచరీ నాటి మగధ సామ్రాజ్య కాలానికి, నేటి కాలానికి లింకప్ చేస్తూ ఈ మూవీని తెరకెక్కించారు. బింబిసారుడిగా, సాధారణ యువకుడిగా ఇందులో కల్యాణ్ రాయ్ రెండు భిన్నమైన పార్శాల్లో సాగే పాత్రల్లో కనిపించబోతున్నారు. సోమవారం ఈ మూవీ ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో కల్యాణ్ రామ్ `బింబిసార`పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రధాన్యతను సంతరించుకుంది.
ఆద్యంతం ఆసక్తికరంగా అబ్బురపరిచే విజువల్స్ తో .. విజువల్ గ్రాండీయర్ తో సాగిన ట్రైలర్ సినిమాపై అంచనాల్నిపెంచేసి భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేసింది. ఆగస్టు 5న భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా వుంటే ట్రైలర్ రిలీజ్ సందర్భంగా హీరో నందమూరి కల్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే ఏడాది `బింబిసార` పార్ట్ 2 వుంటుందని, ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తారని స్పష్టం చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా వుంటే `బింబిసార` 2 పార్ట్స్ కాదని మొత్తం నాలుగు భాగాలుగా కాబోతోందని తెలుస్తోంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో చందమామ కథలని అంతే అందంగా అడాప్ట్ చేసుకుని మనం పాతాల భైరవి, ఆదిత్య 369, మగధీర, బాహుబలి వంటి సినిమాలని తెరపైకి తీసుకొచ్చాం. అదే పంథాలో `బింబిసార`ని కూడా సరికొత్తగా తెరపైకి తీసుకొచ్చామన్నారు కల్యాణ్ రామ్ . అంతే కాకుండా ఈ మూవీని నాలుగు భాగాలుగా రూపొందించాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది 2023 ఆగస్టులో రిలీజ్ అవుతుంది.
అన్నీ సవ్యంగా సాగితే తారక్, నేను కలిసి సీక్వెల్ లో నటిస్తాం` అని కల్యాణ్ రామ్ వెల్లడించడంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ మూవీ ఫ్రాచైజీస్ కోసం హీరో నందమూరి కల్యాణ్‌రామ్ మైండ్ లో వున్న మాస్టర్ ప్లాన్ ఏంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.
ఫస్ట్ పార్ట్ రిలీజ్ కి ముందే మొత్తం నాలుగు పార్ట్ లు చేస్తామని చెప్పడం వెనక ఎలాంటి మాస్టర్ ప్లాన్ ని సిద్ధం చేసుకున్నారన్నది అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. హరి కృష్ణ కె నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నారు. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం, ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతం, సాంగ్స్ కి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.