Begin typing your search above and press return to search.
బుట్టబొమ్మ సంపాదన నెలకు ఎంతంటే?
By: Tupaki Desk | 15 Oct 2021 12:30 PM GMT`అలవైకుంఠపురములో` సక్సెస్ తర్వాత పూజా హెగ్డే కెరీర్ జెట్ స్పీడ్ ని అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగు..తమిళ్..హిందీ అంటూ మూడు భాషల్ని చుట్టేస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్.. బాలీవుడ్ లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతోంది. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల్లో నటిస్తూ రేంజ్ ని అంతకంతకు పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలోనే తమిళ్ లో విజయ్ సరసన నటిస్తున్న `బీస్ట్` సినిమా కు అందుకున్న పారితోషికం సహా.. మరికొన్ని విషయాల్లో పూజాహెగ్డే పేరు వివాదాస్పదంగాను మారింది. భారీగా డిమాండ్ చేసిన పారితోషికంతో పాటు.. వ్యక్తిగత సిబ్బంది.. బాడీగార్స్డ్.. చార్టెట్ ప్లైట్ ఇలా అన్ని రకాలు నిర్మాత నెత్తిన బాదేస్తోందని .. నిర్మాత తరుపున కార్మిక నాయకుడు ఆర్కే సెల్వమణి అంతెత్తున ఎగిరిపడ్డారు.
అటుపై టాలీవుడ్ నుంచి మరో నిర్మాత నట్టి కూమార్ కూడా అమ్మడి డిమాండ్లు ఆకాశంలో ఉన్నాయంటూ మండిపడ్డారు. ఈ విమర్శల నడుమ పూజాహెగ్డే మీడియాలో మరింత హైలైట్ అయింది. ఒక్క హిట్ తోనే ఇంతగా యాటిట్యూడ్ చూపిస్తుందా? అన్న విమర్శలా? సందేహాలు తెరపైకి వచ్చాయి. పూజా హెగ్డే ఒక్కో సినిమాకు ఇప్పుడు 3 కోట్ల వరకూ ఛార్జ్ చేస్తోందట. అలాగే యాడ్స్ ద్వారా నెల ఆదాయం 50 లక్షలకు పైగానే ఉంటుందిట. ఇలా రెండు చేతులా సంపాదిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ముంబై బాంద్రాలో 3బెడ్ రూమ్ కోసం కోట్లు వెచ్చించిందని సమాచారం.
మొత్తంగా పరిశ్రమకు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ పూజాహెగ్దే సంపాదన మొత్తం 50-70 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. కొంత పెట్టుబడిని వ్యాపారాల్లోనూ పెట్టినట్లు సమాచారం. బిజినెస్ లో పెట్టుబడి ఎంత అన్నది ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో `రాధేశ్యామ్`..`ఆచార్య` చిత్రాల్లో నటించింది.ఇవి రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అలాగే మహేష్-త్రివిక్రమ్ కొత్త ప్రాజెక్ట్ లోనూ ఈ అమ్మడినే హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ లో `సిర్కస్`..కోలీవుడ్ లో `బీస్ట్` చిత్రాల్లో నటిస్తోంది.