Begin typing your search above and press return to search.
VD నెక్స్ట్ స్టెప్ ఏంటి..?
By: Tupaki Desk | 8 Nov 2022 9:30 AM GMTపాన్ ఇండియా స్టార్ ని చేస్తుందనుకున్న 'లైగర్' సినిమా.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కు భారీ డిజాస్టర్ ను అందించింది. దీంతో తదుపరి చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొని సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. కానీ దీనికి పరిస్థితులు అంతగా సహకరించడం లేదు.
విజయ్ 'లైగర్' కంటే ముందే రెండు ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత తో కలిసి 'ఖుషి' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ ని పట్టాలెక్కించాడు. అలానే పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో 'JGM' అనే పాన్ ఇండియా మూవీని సెట్స్ మీదకు తీసుకొచ్చాడు.
అయితే పరాజయం తర్వాత అన్నీ మారిపోయాయి. పూరీతో షురూ చేసిన 'జనగణమన' సినిమా పూర్తిగా అటకెక్కినట్లే అని టాక్ నడుస్తోంది. దీంతో 'ఖుషీ' చిత్రంపైనే రౌడీ హీరో ఆశలు పెట్టుకోగా.. సమంత రూత్ ప్రభు అనారోగ్యంతో బాధ పడుతున్న కారణంగా హోల్డ్ లో పడింది.
నిజానికి 'ఖుషి' చిత్రాన్ని 2022 క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ అనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం అవడంతో అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకూ 2023 వాలెంటైన్స్ డే స్పెషల్ గా రావొచ్చని అన్నారు కానీ.. ఇప్పుడైతే 2023 సమ్మర్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది.. సినిమా షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుంది అనే విషయాలపై క్లారిటీ లేదు.
సుకుమార్ తో VD అప్పుడెప్పుడో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు కానీ.. ఇప్పుడు 'పుష్ప 2' చిత్రంతో బిజీగా ఉన్న దర్శకుడు మళ్ళీ విజయ్ దగ్గరకు రావడానికి ఎంత సమయం పడుతుందో.. అసలు వస్తాడో రాడో అనేది కూడా చెప్పలేం.
ఇలా విజయ్ దేవరకొండ సెట్ చేసుకున్న రెండు సినిమాలూ నిలిచిపోవడంతో.. మరో చిత్రం ఇప్పట్లో సెట్స్ మీదకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో.. యువ హీరో ప్రస్తుతం ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో VD నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎలా ముందుకు వెళ్లబోతున్నాడు? అని అందరూ ఆలోచిస్తున్నారు.
ఏ హీరోకైనా ఒక డిజాస్టర్ పడినప్పుడు వెంటనే తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఖాళీగా కూర్చోకుండా మరో ప్రాజెక్ట్ లోకి వెళ్లిపోతుంటారు. ఇప్పుడు విజయ్'D మళ్ళీ రేసులో నిలవాలంటే వీలైనంత త్వరగా ఒక భారీ బ్లాక్ బస్టర్ అందించాలి.
కానీ విజయ్ తో వర్క్ చేయడానికి ప్రెజెంట్ స్టార్ డైరెక్టర్లు ఎవరూ ఖాళీగా లేరు. పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మిడ్ రేంజ్ డైరెక్టర్స్ తో వర్క్ చేయాలని నిర్ణయించుకున్న విజయ్.. దొరికిన సమయాన్ని కొత్త కథలు వినడానికి ఉపయోగించుకుంటున్నాడని తెలుస్తోంది.
ఇందులో భాగంగా 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వీడీ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ తిరస్కరించిన స్క్రిప్ట్ ను విజయ్ ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.
'లైగర్' తర్వాత విజయ్ దేవరకొండ కొన్నాళ్ళు కొంచెం లో ప్రొఫైల్ ను కొనసాగిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎప్పటిలాగే యాక్టీవ్ అయిపోయినట్లు కనిపిస్తోంది. ఇటీవల ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. మనందరికీ మంచి రోజులు ఉన్నాయి.. చెడు రోజులు ఉన్నాయి. గొప్ప సినిమా తీసి మీ అందరిని ఎంటర్టైన్ చేస్తానని వాగ్దానం చేస్తున్నానని అన్నారు.
అలానే లేటెస్టుగా "నేను ఎక్కడికి వెళ్లినా అభిమానులు 'అన్నా.. నువ్వు కమ్‌బ్యాక్ ఇవ్వాలి' అని అడుగుతున్నారు. నేను ఎక్కడికీ వెళ్ళలేదు.. నేను ఇక్కడే ఉన్నాను! ఐ యామ్ రైట్ f*cking here" అంటూ VD తన ఫ్యాన్స్ ని ఉత్సాహ పరిచే ప్రయత్నం చేసాడు. మరి ఫ్యాన్స్ కి మాట ఇచ్చినట్లుగానే త్వరలోనే ఒక మంచి సినిమాతో తిరిగొస్తాడేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.