Begin typing your search above and press return to search.
కేజీఎఫ్ తరువాత యష్ ప్రాజెక్ట్ ఏంటీ?
By: Tupaki Desk | 21 April 2022 11:30 PM GMT'కేజీఎఫ్' హ్యూజ్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో కన్నడ రాకింగ్ స్టార్ యష్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఇక తాజాగా విడుదలైన 'కేజీఎఫ్ 2' తో ఊహించని ఫేజ్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. 'బాహుబలి' ఫాంచైజీలతో ప్రభాస్ దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అదే స్థాయిలో బాలీవుడ్ లోనూ హాట్ ఫేవరేట్ అయ్యారు. ఇప్పడు ఇదే తరహాలో యష్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచారు. ప్రస్తుతం యష్ నటించిన 'కేజీఎఫ్ 2' దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబడుతూ సంచలనాలు సృష్టిస్తోంది.
త్వరలోనే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హ్యూజ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న యష్ నెక్స్ట్ మూవీ ఏంటనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. దీనిపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. 'బాహుబలి 2' తరువాత తనకు ఏర్పడిన క్రేజ్ కు భిన్నంగా అడుగులు వేయకుండా భారీ చిత్రాల్లో మాత్రమే నటిస్తూ కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం కేజీఎఫ్ 2 తువాత కూడా యష్ ఇదే పంథాను అనుసరించి సినిమాలు చేయాల్సి వుంటుందని చెబుతున్నారు.
ప్రభాస్ 'బాహుబలి 2 ' తరువాత అదే ఫార్ములాని ఫాలో అవుతూ 'సాహో' మూవీ చేశారు. అది దక్షిణాదిలో ఫరవాలేదనిపించినా ఉత్తరాదిలో మాత్రం భారీ స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. అయితే ఆ తరువాత చేసిన 'రాధేశ్యామ్' ఆశించిన ఫలితాన్ని రాబట్టలేక భారీ నష్టాలని మిగిల్చింది. అచితే ప్రభాస్ అదే ఫార్ములాని ఫాలో అవుతూ బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ సినిమాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఇందులో 'ఆది పురుష్' చిత్రీకరణ పూర్తయి రిలీజ్ కు రెడీ అవుతోంది. సలార్, ప్రాజెక్ట్ కె చిత్రీకరణ దశలో వున్నాయి. సందీప్ రెడ్డి వంగ 'స్పిరిట్' సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. అయితే యష్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా వుంది. 'కేజీఎఫ్ 2' తో హీరోగా పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ని అయితే సొంతం చేసుకున్నారు కానీ ఆ రేంజ్ లో ఈ మూవీ తరువాత ఆయన తో సినిమాలు చేసే దర్శకులు మాత్రం లేరు.
దీంతో యష్ నెక్స్ట్ మూవీ ఎవరితో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ కు భారీ లైనప్ వుంది . బ్యాక్ కు బ్యాక్ క్రేజీ డైరెక్టర్లు లైన్ లో వున్నారు. కానీ యష్ కు మాత్రం ఆ స్థాయి డైరెక్టర్ ల లిస్ట్ మాత్రం కనిపించడం లేదు.
అలా 'కేజీఎఫ్ 2' కు తగ్గ సినిమా మళ్లీ చేస్తేనే వచ్చిన క్రేజ్ నిలబడుతుంది. లేదంటే అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని యష్ తన తదుపరి చిత్రానికి ఏ స్టార్ డైరెక్టర్ ని ఎంచుకుంటారో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు.