Begin typing your search above and press return to search.

కుర్చీలాట‌లోనే మాయంతా!

By:  Tupaki Desk   |   14 Aug 2018 4:37 PM GMT
కుర్చీలాట‌లోనే మాయంతా!
X
మార్మిక‌త‌ - మ‌ర్మం లేనిదే త్రివిక్ర‌ముని సంభాష‌ణ‌లు ఉండ‌వు. లోతైన సంభాష‌ణా చాతుర్యం అత‌డి ప్ర‌ధాన‌ ఆయుధం. అలానే లోతుగా ఆలోచించి స‌న్నివేశాల్ని మ‌ల‌చ‌డం - స్క్రీన్‌ ప్లేని తీర్చిదిద్ద‌డం త్రివిక్ర‌మ్ ప్ర‌త్యేక‌త‌. అందుకే అత‌డి సినిమా అంటే జ‌నంలో అంత క్రేజు. ఇటీవ‌లే తెర‌కెక్కించిన `అజ్ఞాత‌వాసి` లెక్క త‌ప్పిందే కానీ, అస‌లు త్రివిక్ర‌మ్‌ పై ఆడియెన్ కాన్ఫిడెన్స్ లెవ‌ల్ వేరేగా ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్‌తోనే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ వెంట‌ప‌డి మ‌రీ సినిమా చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ కాంబినేష‌న్‌ లో `అర‌వింద స‌మేత` ఆన్‌సెట్స్ ఉంది. ఈ ఆగ‌స్టు 15న టీజ‌ర్‌ ని లాంచ్ చేసేందుకు టీమ్ రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ ఆస‌క్తి రేకెత్తించింది. ఈ బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు టీజ‌ర్‌ రిలీజ్ కానుంది. అంత‌కుముందే త్రివిక్ర‌మ్ ఈ పోస్ట‌ర్‌ తో త‌న‌దైన శైలిలో సందేశం ఇచ్చాడ‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

అప్పుడు గురి త‌ప్పినా ఈసారి గురి త‌ప్ప‌ను! అన్న సిగ్నల్‌ ని తార‌క్ లుక్‌ లో చూపించాడు. అజ్ఞాత‌వాసిలో రాబోవు స‌న్నివేశాల సారాన్ని.. సినిమా ఉద్ధేశాన్ని కుర్చీని గిర‌గిరా తిప్పి వ‌ద‌ల‌డం ద్వారా - ఆ కుర్చీ మేకింగ్ విధానం ద్వారా చెప్పాల‌న్న ఎత్తుగ‌డ‌ను అనుస‌రించాడు త్రివిక్ర‌మ్‌. ఈసారి కూడా ఆ డార్క్‌లో ఎన్టీఆర్ అదే త‌ర‌హా చెక్క కుర్చీపైనే కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. శ‌త్రువు ఎంతో బ‌ల‌మైన‌వాడు. వాడిని ఢీకొట్టాలంటే అంతే తెలివిగా ఆలోచించాల‌న్న ఎత్తుగ‌డ అత‌డి మైండ్‌ లో ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

పైగా ఈ ఫ్యాక్ష‌న్ వ‌ర‌ల్డ్‌ లో త‌న తండ్రి నాగ‌బాబుకి ఏదైనా ఆప‌ద ఉంటుంద‌ని గ్ర‌హించాడో ఏమో.. మ‌రీ అంత సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నాడు తార‌క్‌. రేపు శ‌త్రువు ఎలా ఎదురొస్తాడు? వాడి కంటే తెలివిగా ఎదురెళ్లి దెబ్బ తీయ‌డం ఎలా? అన్న క‌సి క‌నిపిస్తోంది. ఆ కుర్చీ కింద ప‌డి చ‌చ్చినోడు చాలానే ఆలోచ‌న‌ల్ని రేకెత్తించి చ‌చ్చాడు. రేపు ఎదుర్కోబోయేది అంత సులువేం కాదు. ప్రాణానికి తెగించి జ‌యాప‌జ‌యాల్ని చూడాల్సి ఉంటుంది. అందుకే అంత సుదీర్ఘ ఆలోచ‌న‌లో ఉన్నాడా? అనిపిస్తోంది. మొత్తానికి త్రివిక్ర‌మ్ మార్మిక‌త‌ను ఈ ముంద‌స్తు పోస్ట‌ర్ ఎలివేట్ చేసింది. `అర‌వింద స‌మేత‌` ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 11న రిలీజ‌వుతోంది. ఇది ప‌క్కా ఫ్యామిలీ మాస్ యాక్ష‌న్ సినిమా అని అర్థ‌మ‌వుతోంది.