Begin typing your search above and press return to search.

ఇంతకీ అలియా సమస్య ఏంటో ?

By:  Tupaki Desk   |   24 Jun 2019 5:36 AM GMT
ఇంతకీ అలియా సమస్య ఏంటో ?
X
పక్కా ప్లానింగ్ తోనే మొదలుపెట్టినా విధి రాసిన రాత ఇంకోలా ఉండటంతో ఆర్ ఆర్ ఆర్ కు అడుగడుగునా పరీక్షలే ఎదురవుతున్నాయి. ఇద్దరు హీరోలు విడివిడిగా గాయపడ్డారు. కొంత బ్రేక్ పడింది. సరే కోలుకున్నారు వచ్చారు తిరిగి స్టార్ట్ అయ్యింది కదా అని సంతోషించే లోపే హీరొయిన్ అలియా భట్ కు అనారోగ్యం. అమెరికాకు జంప్. సరే వెంటనే వస్తుందేమో అనుకుంటే ముంబై మీడియా అలియా ప్రియుడు అని చెబుతున్న రన్బీర్ కపూర్ తో ఏదో ట్రిప్ అట. హిందీ సినిమా బ్రహ్మాస్త్ర షూటింగ్ కూడా తనవల్లె కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.

ఆర్ ఆర్ ఆర్ ప్రకటన టైంలో నెమో తాను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని చెప్పిన అలియా భట్ ఆ తర్వాత దానికి తగ్గట్టు కో ఆపరేషన్ ఇవ్వడం లేదని ఇన్ సైడ్ టాక్ జోరుగా ఉంది. అలియా భట్ ఎప్పుడు వస్తుంది అనే దానితో సంబంధం లేకుండా మిగిలిన పార్ట్ ని నాన్ స్టాప్ గా షూట్ చేసేందుకు జక్కన్న రెడీ అయినట్టు సమాచారం. అలియా అంతా సెట్ చేసుకుని మెసేజ్ ఇచ్చాక అప్పుడు ప్లాన్ లో మార్పులు చేస్తారు.

అహ్మదాబాద్ షెడ్యూల్ లోనే అలియా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇప్పటికే బాలీవుడ్ లో అలియాకు చిన్న పాత్ర ఇచ్చారనే ప్రచారం మొదలుపెట్టారు. కేవలం చరణ్ తారక్ పాత్రల గురించి మాత్రమే చెప్పిన రాజమౌళి వెర్షన్ కు భిన్నంగా అక్కడ స్వంత కథనాలు వడ్డించడం విశేషం. అలియా భట్ వీలైనంత త్వరగా వస్తేనే ఆర్ఆర్ఆర్ లో వేగం పెరుగుతుంది. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ పక్కన జోడిని సెట్ చేయడం కూడా పెండింగ్ లోనే ఉండిపోయింది