Begin typing your search above and press return to search.

రాజేంద్రుడి సినిమాపై ప‌బ్లిక్ రియాక్ష్ ఏంటీ?

By:  Tupaki Desk   |   29 Oct 2022 3:26 PM GMT
రాజేంద్రుడి సినిమాపై ప‌బ్లిక్ రియాక్ష్ ఏంటీ?
X
కంటెంట్ వున్న సినిమాల‌కే ఇప్ప‌డు ఆడియ‌న్స్ ప‌ట్టం క‌డుతున్నారు. స్టార్ హీరో న‌టించిన సినిమానా?, కొత్త హీరో సినిమానా అని లెక్క‌లు వేసుకుని థియేట‌ర్ల‌కు రావ‌డం లేదు. కంటెంట్ బాగుందా.. హీరో ఎవ‌రైనా స‌రే థియేట‌ర్ల‌కు వ‌చ్చేస్తున్నారు. మంచి క‌థ‌బ‌ల‌మున్న సినిమాల‌ని ఆద‌రిస్తున్నారు. దీంతో స్టార్ హీరో న‌టించినా కంటెంట్ లుని సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా ఆడ‌టం లేదు. దానికి బ‌స్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచిన సినిమాలు గాడ్ ఫాద‌ర్‌, కాంతార‌.

మెగాస్టార్ న‌టించిన 'గాడ్ ఫాద‌ర్‌' ఇటీవ‌ల అక్టోబ‌ర్ 5న ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌లైన విష‌యం తెలిసిందే. మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ఫిల్మ్ 'లూసీఫ‌ర్‌' ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేశారు. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో హౌస్ ఫుల్స్ తో ర‌న్న‌యినా ఆ త‌రువాత క‌న్న‌డ మూవీ 'కాంతార‌' రిలీజ్ త‌రువాత డ‌ల్ అయిపోయింది. రెండ‌వ వారం లోకి వ‌చ్చేస‌రికి ఈ సినిమా గురించి పెద్ద‌గా ప‌ట్టించుకున్న వాళ్లే లేరు. కార‌ణం 'కాంతార‌'. స‌రికొత్త క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందిన సినిమా కావడం, బ‌ల‌మైన కంటెంట్ వున్న సినిమా కావ‌డంతో దీని ముందు మెగాస్టార్ 'గాడ్ ఫాద‌ర్‌' నిల‌బ‌డ‌లేక‌పోయింది.

'కాంతార' ప్ర‌భంజ‌నం ముందు సైలెంట్ అయిపోయింది. ఇలాంటి త‌రుణంలో కంటెంట్ లేని సినిమాల ప‌రిస్థితి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. అయినా స‌రే కొంత మంది మార్కెట్ లేని న‌టుల‌తో ప్ర‌యోగాలు చేస్తూ సినిమాలు తెర‌కెక్కిస్తున్నారు. ఓటీటీల్లో కాకుండా నేరుగా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తూ ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నారు. రీసెంట్ గా అలీ న‌టించిన అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి' ఫ‌లితాన్ని మ‌రువ‌క ముందే రాజేంద్ర ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన 'అనుకోని ప్ర‌యాణం' థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది.

క‌రోనా స‌మ‌యం నాటి ఇద్ద‌రు స్నేహితుల క‌థ‌తో ఈ మూవీని రూపొందించారు. మ‌రో పాత్ర‌లో న‌ర‌సింహారాజు న‌టించారు. స్టార్ హీరోల సినిమాల‌కే కంటెంట్ లేక‌పోతే ఓపెనింగ్స్ క‌ష్ట‌మ‌వుతున్న ఈ రోజుల్లో క‌రోనా కాలం నాటి క‌థ‌తో రాజేంద్ర ప్ర‌సాద్, న‌ర‌సింహారాజు లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన 'అనుకోని ప్ర‌యాణం' కోసం ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని ఎలా ధైర్యం చేశారో అర్థం కావ‌డం లేద‌ని స‌గ‌టు ప్రేక్ష‌కుడు పెద‌వి విరుస్తున్నాడు.

ఎక్క‌డో భువ‌నేశ్వ‌ర్ లో ప‌ని చేస్తున్న ఇద్ద‌రు తెలుగు వాళ్లు లాక్ డౌన్ స‌మ‌యంలో త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేర‌డం కోసం ఎలాంటి అవాంత‌రాల్ని ఎదుర్కొన్నారు.. ఈ క్ర‌మంలో ఇద్ద‌రిలో ఒక‌రు చ‌నిపోతే మ‌రో వ్య‌క్తి ఆ శ‌వాన్ని మోస్తూసాగించిన ఎమోష‌న‌ల్ జ‌ర్నీగా ఈ సినిమాని రూపొందించారు. ఈ శుక్రవారం విడుద‌లైన ఈ మూవీకి ఆద‌ర‌ణ క‌రువైంది. బ‌రువైన స‌న్నివేశాల‌తో స్టార్ కాస్ట్ లేని ఈ మూవీపై ప్రేక్ష‌కులు ఆస‌క్తిని చూపించ‌డం లేదు. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అయితే ఏమైనా ప్ర‌భావం చూపించేదేమో కానీ థియేట‌ర్ల‌లో అంటే ఇలాంటి సినిమా కోసం ప్ర‌త్యేకంగా థియేట‌ర్ల‌కు రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు.

అనుభ‌వం వున్న ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ప‌ని చేసినా స‌గ‌టు ప్రేక్ష‌కుడిని ఆక‌ట్టుకునే విధంగా ఈ మూవీని ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ పోదిరెడ్ల రూపొందించ‌లేక‌పోయాడు. దీంతో అనుకోని ప్ర‌యాణం అనుకున్న గ‌మ్యం చేర‌లేక‌పోయింది. క‌నీసం ఓపెనింగ్స్ కూడా రాబ‌ట్ట‌లేక‌పోయింద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.