Begin typing your search above and press return to search.
టాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరి రేంజ్ ఎంత?
By: Tupaki Desk | 21 Jan 2021 5:30 PM GMTదాదాపు వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో టాలీవుడ్ కి 89ఏళ్ల చరిత్ర ఉంది. 9 దశాబ్ధాల్లో ఎందరో దిగ్ధర్శకులు వచ్చి వెళ్లారు. ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించిన మేటి దర్శకులు ఎందరో ఉన్నారు. అయితే నేటి తరంలో ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల లీగ్ లో ఎవరున్నారు? ఇప్పుడు ఆ లీగ్ లోకి ఎవరు కొత్తగా ఎవరు వచ్చారు? బయటికెళ్లే అంచుల్లో ఎవరున్నారు? అన్నది పరిశీలిస్తే..
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎప్పటినుంచో నెంబర్ వన్. అపజయమెరుగని దర్శకుడాయన. తీసినవన్నీ హిట్లే. పాన్ ఇండియా సినిమాలతో సంచలనాలు సృష్టించడం ఆయనకే చెల్లింది. కమర్షియల్ సినిమా మేకింగ్ కి టెక్నికాలిటీస్ ని జోడించి సత్తా చాటడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా అని నిరూపణ అయ్యింది. ఆయనను టాలీవుడ్ కామెరూన్ అని పిలిచేంత గొప్ప అభిమానులున్నారు. ఇప్పటికి టాలీవుడ్ లో రాజ్ మౌళి నెంబర్ వన్ అనే చెప్పాలి.
ఆ తర్వాత అపజయమెరుగని దర్శకులుగా.. కొరటాల శివ.. అనిల్ రావిపూడి పేర్లు వినిపిస్తున్నాయి. కొరటాల శివ.. అనీల్ రావిపూడిలతో పోలిస్తే ఎంతో సీనియర్ అయిన త్రివిక్రమ్ ఎప్పటికీ ఎవ్వర్ గ్రీన్ డైరెక్టర్ గా నిలిచిపోయారు. ఆయనకు అజ్ఞతవాసి లాంటి డిజాస్టర్.. కొన్ని యావరేజ్ లు ఉండడం మైనస్ అని చెప్పవచ్చు. ఆ తరువాత సుకుమార్ .. క్రిష్ మేధోతనంతో సినిమాలు తీసే విలక్షణ దర్శకులు. వారికి జయాపజయాలు సమప్రాధాన్యతతో ఉన్నాయి. క్లాసిక్స్ తో వండర్స్ చేయగల సమర్థులు.
ఆ తరువాత స్థానాలు సురెందర్ రెడ్డి.. పూరీ జగన్నాథ్ లకు ఇవ్వాలి. అయితే లైగర్ హిట్ అయితే పూరీని ఎవ్వరూ ఆపలేరు. అలానే బిబి 3 తరువాత మాస్ డైరెక్టర్ బోయపాటి పరిస్థితి తెలిసిపోతుంది. హరీశ్ శంకర్ అప్పుడప్పుడు విజయాలతో సత్తా చాటుతున్నాడు. ఇక తాజాగా హిట్లు అందుకుని ఫామ్ లో ఉన్న గోపీచంద్ మలినేని.. వెంకీ కుడుముల.. ప్రశాంత్ నీల్.. పరశురామ్ అలియాస్ బుజ్జి.. శివనిర్వాణ.. సుధీర్ వర్మ.. త్రినాథ్.. చందు మొండేటి వంటి వారు ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది.