Begin typing your search above and press return to search.
మెగా రీ-రిలీజ్ ల వెనుక అసలి కథేంటి?
By: Tupaki Desk | 28 Nov 2022 12:30 PM GMTమెగా హీరోల ఓల్డ్ హిట్స్ రీ-రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. అకేషనల్ గా మెగా కాంపౌండ్ హీరోల చిత్రాలు అన్నింటిని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి..పవన్ కళ్యాణ్ పాత హిట్ చిత్రాలు కొన్ని అభిమానుల ముందుకొచ్చాయి. ఇంకా మరిన్ని చిత్రాలు అప్ డేటెడ్ వెర్షన్తో రిలీజ్ చేయానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఊపు చూస్తుంటే అన్నదమ్ములిద్దరు చిత్రాలు మరిన్ని రిలీజ్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పుడీ వరుసలోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కూడా వచ్చి చేరారు. ఆయన హీరోగా నటించిన ప్లాప్ చిత్రం `ఆరెంజ్` ని మళ్లీ రీ-రిలీజ్ చేస్తున్నట్లు నాగబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. `ఆరెంజ్` కి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
అయితే ఇలా వరుసగా మెగా హీరోల చిత్రాలన్నీరీ-రిలీజ్ అవుతుంటే రకరకాల సందేహాలుకు తావిస్తోంది. రీ-రిలీజ్ ల వెనుక రాజకీయ కోణం ఉందా? అంటూ కొందరు సందేహిస్తున్నారు. శివ శంకర వర ప్రసాద్ చిరంజీవి అయింది పాత్ర చిత్రాలతోనే. అప్పట్లో ఆ చిత్రాల్ని కోట్లాది మంది అభిమానులు ఆదరించడంతోనే అంతటి వాడు అయ్యారు.
ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసారు. కానీ ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీ ఆయనపై ఒక్కసారిగా మరకలు పులిమింది. ఆకారణంగా అభిమానం పరంగా కొంత డ్యామేజ్ జరిగింది. క్రేజ్ పరంగానూ ప్రతికూల వాతావరణం కనిపించింది. అన్నదమ్ముల మధ్య రాజకీయ పొరపొచ్చాలు తలెత్తాయని చాలా కాలంగా వైరల్ అవుతూనే ఉంది.
ఇప్పుడు వాటన్నింటిని తొలగించాలి అంటే పాత చిత్రాలు కొంత వరకూ కనుమరుగు అయ్యేలా చేస్తాయని....ఎన్నికల సమయానికి క్రేజ్ పరంగా బిల్డ్ చేసుకోవడానికి ..ఈ సినిమాలు అభిమానుల మధ్య ఐక్యతని తీసుకొస్తాయన్నది ఓ స్ర్టాటజీగా కనిపిస్తోందంటున్నారు. అలా కాకపోతే పనిగట్టుకుని మెగా హీరోల చిత్రాల దేనికి రిలీజ్ అవుతున్నాయి? చిరు సమకాలీకులు వెంకటేష్ ..నాగార్జున ..బాలయ్య సినిమాలు ఎందుకు రిలీజ్ కాలేదంటూ సందేహాలు తట్టి లేపుతున్నారు. మరి ఇది మెగా కాంపౌండ్ పొలిటికల్ స్ట్రాటజీ నా? లేక ఇంకేదైనా ఉందా? అన్నది తెలియాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.