Begin typing your search above and press return to search.

ప్యారిస్ లో అఖండ హంగామా వెన‌క కార‌ణం?

By:  Tupaki Desk   |   8 Dec 2021 8:32 AM GMT
ప్యారిస్ లో అఖండ హంగామా వెన‌క కార‌ణం?
X
న‌ట‌సింహా బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించిన `అఖండ` భారీ విజ‌యం దిశ‌గా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 2న రిలీజ్ అయిన `అఖండ` ఇప్ప‌టికీ హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వ‌ద్ద 80కోట్ల వ‌సూళ్ల‌ను అధిగ‌మించింది. క‌రోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఓవైపు చాప‌కింద నిరులా విస్త‌రిస్తున్నా ఆ ప్ర‌భావం `అఖండ` వేవ్ ముందు ఎంత మాత్రం క‌నిపించ‌డంలేదు.

హిందూత్వం..దేవాల‌యాల ప‌రిర‌క్ష‌ణ అనే పాయింట్ ని బేస్ చేసుకుని అల్లిన క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు.. బోయ‌పాటి శైలి మేకింగ్ అఖండ‌ని అగ్ర‌ప‌థాన నిల‌బెట్టింద‌ని చెప్పొచ్చు.

`అఖండ` పాత్ర‌తోనే మాస్ లోకి సినిమాని ఎక్కించేసారు. బాలీవుడ్ లో రీమేక్ దిశ‌గా ఆలోచ‌న చేస్తున్నారంటే అఖండ లో బోయ‌పాటి తీసుకున్న థ్రెడ్ ఎంత బ‌లంగా ఉంద‌న్న‌ది అర్థం చేసుకోవ‌చ్చు. సినిమాకి రివ్యూలు నెగిటివ్ గా వ‌చ్చినా బాల‌య్య బ్రాండ్ ముందు అవేవీ నిల‌బ‌డ‌లేదు.

తెలుగు రాష్ట్రాలు స‌హా అమెరికా ఓవ‌ర్సీస్ లోనూ భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. తాజాగా ఈ చిత్రాన్ని ఫారిస్ లో స్పెష‌ల్ స్క్రీనింగ్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఆన్ లైన్ బుకింగ్ పోర్ట‌ల్ ని కూడా ఏర్పాటు చేసి బుకింగ్ ఓపెన్ చేసారు. `పాత్తేలా విల్లేటే సినిమాస్` లో షో వేస్తున్నారు. షో టైమింగ్ పారిస్ స్థానిక కాల‌మాన ప్ర‌కారం సాయంత్రం 7.45 ని.ల‌కు స్ట్రీమింగ్ కానుంది.

ప్ర‌పంచంలో అన్ని దేశాలు ఉండ‌గా పారిస్ లోస్పెష‌ల్ గా షో వేయ‌డం వెన‌క చాలా సంగ‌తులే ఉన్నాయి. అక్క‌డ తెలుగు ప్ర‌జ‌లు ఎక్కువ‌గా నివ‌సిస్తున్నారు. అలాగే హిందు ప‌రిర‌క్ష‌ణ స‌మితులు.. హిందూ సంఘాలు కూడా అక్క‌డ కొలువు దీరాయి. పారిస్ ప్ర‌జ‌లు హిందు సంస్కృతిని ఎంతో గౌర‌విస్తారు.

ఈ నేప‌థ్యంలో అఖండ‌తో హిందువుల‌ ఖ్యాతిని పారిస్ లోనే తెలియ‌జేయాల‌ని స్పెష‌ల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ద్వారకా క్రియేష‌న్స్ ప‌తాకంపై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మించారు. త‌మ‌న్ సంగీతం అందించారు.