Begin typing your search above and press return to search.
పేరు మార్పా.. తక్కువ రేట్లా.. ఏది కారణం?
By: Tupaki Desk | 21 May 2019 7:08 AM GMTమెగాఫ్యామిలీ హీరో సాయి తేజ్ తన కెరీర్ లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాడనే సంగతి తెలిసిందే. వరసగా ఆరు ఫ్లాపులతో ఏ హీరో కూడా కోరుకొని డబల్ హ్యాట్రిక్ సాధించాడు. దీంతో మెగా మేనల్లుడు తన రూటు మార్చి కాస్త జాగ్రత్తగా నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకున్నాడు. అంతే కాదు తన పేరులో నుంచి 'ధరమ్' ను షిఫ్ట్ డిలీట్ కొట్టాడు. సాయి తేజ్ గా 'చిత్రలహరి' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
నిజానికి ఈ సినిమా పెద్ద హిట్టేమీ కాదు. బ్లాక్ బస్టర్ అంతకన్నా కాదు. సినిమాను భారీ రేట్లకు అమ్మకుండా తక్కువకే అమ్మడంతో హిట్ అనిపించుకుంది. నిజానికి సాయి తేజ్ సినిమాకు దాదాపు 20 కోట్ల మార్కెట్ ఉంది కానీ నిర్మాతలు 14 కోట్లకు మాత్రమే అమ్మారు. 'చిత్రలహరి' ఇప్పటివరకూ 15 కోట్లకు పైగా థియేట్రికల్ షేర్ వసూలు చేసింది. దీంతో ఈ సినిమాను కొన్న బయ్యర్లను సేవ్ చేసింది. ఒకవేళ ఈ సినిమాను 20 కోట్ల రేంజ్ లో అమ్మి ఉంటే సాయి తేజ్ కెరీర్లో ఇదో మరొక ఫ్లాప్ అయి ఉండేది.
ఆరు ఫ్లాపుల తర్వాత సాయి తేజ్ కు విజయం అదించింది ఈ చిత్రం. మరి దీనికి కారణం తక్కువ రేట్లకు రైట్స్ అమ్మడమా లేక న్యూమరాలజీ ప్రకారం మార్చుకున్న సాయి తేజ్ పేరా? న్యూమరాలజీ.. ఆస్ట్రాలజిని నమ్మనివారు ఈ సినిమాను తక్కువ రేట్లకు అమ్మడమే కారణం అంటారు. అలా కాకుండా రాహుకాలం యమగండం లాంటివి నమ్మేవారు పేరు మార్పేనని అంటారు. ఏదేమైనా మెగా మేనల్లుడికి రిలీఫ్ వచ్చింది. అదే పదివేలు.