Begin typing your search above and press return to search.
సింగర్ దుర్గవ్వకు భీమ్లా టీమ్ ఎంతిచ్చారు?
By: Tupaki Desk | 24 Feb 2022 10:36 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం `భీమ్లా నాయక్`. రిలీజ్ కు ముందు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు స్కై హైకి చేరాయి. తాజాగా ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా విడుదల చేసిన థియేట్రికల్ రిలీజ్ ట్రైలర్ మరణా మాస్ అంటూ ఓ రేంజ్ లో నెట్టింట రచ్చకు తెరలేపింది. మలయాళ హిట్ ఫిల్మ్ అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాగర్ కె. చంద్ర అత్యంత పవర్ పుల్ గా తెరకెక్కించారు.
త్రివిక్రమ్ వెన్నుదన్నుగా నిలిచిన ఈ చిత్రంలో ఆయన మార్కు డైలాగ్ లు మాత్రం వినిపించడం లేదు. సినిమా మాస్ మసాలా యాక్షన్ డ్రామా కావడంతో అందుకు తగ్గట్టుగా నే డైలాగ్ లని త్రివిక్రమ్ అందించినట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా విడుదలైన థియేట్రికల్ రిలీజ్ ట్రైలర్ లో పవన్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో సునామీని సృష్టించనున్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి.
నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రంతో ఇద్దరు జానపద కళాకారులు వెలుగులోకి వచ్చారు. అందులో ఒకరు పన్నెండు మెట్ల కిన్నెర మెగిలయ్య.. మరొకరు కుమ్మరి దుర్గవ్వ. ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ ని సాయి కృష్ణ - పృథ్వీచంద్ర - రామ్ మిర్యాల తో కలిసి కిన్నెర మొగిలయ్య ఆలపించిన విషయం తెలిసిందే. ఇందులోని మరో పాటని సాహితి చాగంటితో కలిసి కుమ్మరి దుర్గవ్వ ఆలపించారు.
కుమ్మరి దుర్గవ్వ .. సాహితీ చాగంటితో కలిసి `అడవి తల్లి మాట..` నెట్టింట ఏ స్థాయిలో వైరల్ గా మారిందో అందరికి తెలిసిందే. తమన్ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. కూలి పనులు చేసుకుంటూ ఫోక్ సాంగ్స్ పాడే దుర్గవ్వ అడివి తల్లి పాటని పాడిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. అయితే ఈ పాట పాడినందుకు దుర్గవ్వకు భీమ్లా టీమ్ పారితోషంగా ఎంతిచ్చారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
`భీమ్లా నాయక్` రిలీజ్ సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుర్గవ్వ ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. సిరిసిల్ల సిన్నది.. ఉంగురము పాటలు పాడాను. అవి మంచి ఆదరణ పొందాయి. ఆ పాటలు విని `భీమ్లా నాయక్`లో పాట పాడమని ఆఫర్ ఇచ్చారని, ఐదారు నిమిషాల్లోనే పాట పాడేశానని, ఈ పాట కు రూ. 10 వేలు ఇచ్చారని, మిగతా మొత్తాన్ని నా కూతురుకు అందజేశారని తెలిపింది. అయితే తనకు ఈ పాట పరంగా ఎంత అందింది అన్నది మాత్రం క్లియర్ గా దుర్గవ్వ స్పష్టం చేయకపోవడం గమనార్హం.