Begin typing your search above and press return to search.
F3 లీడ్స్ ఒక్కక్కరి పారితోషికం ఎంత?
By: Tupaki Desk | 20 May 2022 6:30 AM GMTఎఫ్ 2 బ్లాక్ బస్టర్ విజయం సాధించాక విక్టరీ వెంకటేష్... వరుణ్ తేజ్ రేంజు పారితోషికంలో ఎంతో పెరిగింది. ఈ జోడీ బాలీవుడ్ తరహా కామిక్ కేపర్లను తెలుగు ఆడియెన్ కి అందించగలరని ప్రామిస్సింగ్ పెర్ఫామెన్సెస్ తో మెప్పించగలరని ఎఫ్ 2 నిరూపించింది.
అందుకే ఈ ఫ్రాంఛైజీ నుంచి ఇప్పుడు సీక్వెల్ కాని ప్రీక్వెల్ కాని కొత్త కథతో సినిమా తీస్తున్నానని అనీల్ రావిపూడి ప్రకటించగానే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎఫ్ 2 పాత్రలు రిపీటైనా ఎఫ్ 3 కథలో కొత్తదనం ఎంపిక చేసుకున్న సెటైరికల్ ఎలిమెంట్ పెద్ద ఫ్రెష్ ఫీల్ ని తెస్తాయని అనీల్ రావిపూడి టీమ్ చెబుతోంది.
వెంకీ వరుణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న ఎఫ్3 చిత్రం ఈ నెల 27న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీమ్ ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఇక ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ .. వరుణ్ తేజ్ ఒకరితో ఒకరు పోటీపడుతూ నవ్వులు పండించారని ఇటీవల విడుదలైన ట్రైలర్ రివీల్ చేసింది.
ముఖ్యంగా సీనియర్ అయిన వెంకీ కీలక పాత్ర పోషిస్తూ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. రేచీకటితో ఇబ్బంది పడే వ్యక్తిగా వెంకటేష్ కనిపించనున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్- తమన్నా- మెహ్రీన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీఎస్పీ సంగీతం అందించారు.
ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం వెంకటేష్ 15 కోట్లు పారితోషికం తీసుకున్నాడని తెలిసింది. ఇక ఇందులో నత్తి ఉన్న కుర్రాడిగా కనిపిస్తూ బోలెడంత కామెడీ పండించిన వరుణ్ తేజ్ కి పారితోషికం పెద్ద మొత్తంలోనే అందిందని తెలిసింది.
వరుణ్ తేజ్ రేంజ్ ఇటీవల 8 కోట్లకు చేరుకుంది. కానీ ఎఫ్ 3 కోసం ఏకంగా 13కోట్లు డిమాండ్ చేసాడన్న ప్రచారం ఉంది. కానీ వరుణ్ తో మాట్లాడిన నిర్మాతలు తెలివైన రీజనబుల్ పారితోషికాన్ని ఫిక్స్ చేసారన్న గుసగుసలు ఇంతకుముందు వినిపించాయి. ఇక ఈ సినిమాలో నటిస్తున్న కథానాయికలు తమన్నాకు 1.8 కోట్లు .. మెహ్రీన్ కి 80లక్షల రేంజులో పారితోషికాలు ముట్టాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.