Begin typing your search above and press return to search.
లతా మంగేష్కర్ మరణం వెనక రహస్యం?
By: Tupaki Desk | 6 Feb 2022 7:30 AM GMTలెజెండరీ గాయని .. గాన కోకిల లతా మంగేష్కర్ 92 వయసులో మరణించిన సంగతి తెలిసిందే. ముంబైలోని ప్రముఖ కార్పొరెట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లతాజీ మృతి చెందారు. అయితే ఆమె మరణానికి కారణమేమిటీ? అంటూ అభిమానులు ఆరాలు తీస్తున్నారు.
నిజానికి లతాజీకి న్యూమోనియా ఉందని దానికి చికిత్స చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు. దానికి తోడు కోవిడ్ సోకడంతో సమస్య సంక్లిష్ఠంగా మారి ఐసీయులో ఉంచాల్సి వచ్చింది. అయితే అసలు కారణం తాజాగా రివీలైంది. లతాజీ శరీరంలో బహుళ అవయవ వైఫల్యం (మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్) కారణంగా మరణించారని తెలుస్తోంది.
లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆమె వారాల పాటు వెంటిలేటర్ పైనే ఉన్నారు. కానీ జనవరి 28న ఆమె మెరుగుదల సంకేతాలను చూపించడంతో ఆమెను వెంటిలేటర్ నుండి తొలగించారు. శనివారం ఆమె ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించడంతో ఆమెను తిరిగి వెంటిలేటర్ పై ఉంచారు. శరీరంలో అవయవాలు పని చేయకపోవడం సహకరించకపోవడంతోనే ఈ మరణం సంభవించిందని తాజాగా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. లతాజీ మరణానంతరం సినీరాజకీయ రంగాలు సహా అన్ని వర్గాల నుంచి నివాళులర్పించడం ప్రారంభమైంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ.. రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు లతాజీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. లతా మంగేష్కర్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. హోంమంత్రి అమిత్ షా ఇంతకుముందే సంతాపం తెలిపారు. తెలుగు సినీపరిశ్రమ నుంచి వెల్లువలా ప్రముఖుల నుంచి సంతాపాలు కొనసాగుతున్నాయి.