Begin typing your search above and press return to search.
పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ పరిస్థితేంటీ?
By: Tupaki Desk | 17 Sep 2022 5:35 AM GMTడ్రీమ్ ప్రాజెక్ట్ లు ఈ మధ్య స్టార్ డైరెక్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏస్ డైరెక్టర్ మణిరత్నం తన కలల ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలని విశ్వప్రయత్నాలు చేసి దాదాపు 30 ఏళ్లు శ్రమించాల్సి వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ అధినేత ముందుకు రావడంతో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఎట్టకేలకు పట్టాలెక్కింది.
ఇక తెలుగు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం ఇప్పటికీ ఇబ్బందులు కలిగిస్తూనే వుంది. పూరి జగన్నాథ్ గత కొన్నేళ్లుగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన'ని పట్టాలెక్కించాలని ప్రయత్నాలు చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి చాలా మందికి ఈ కథని వినిపించి భారీ స్థాయిలో దేశ భక్తి ప్రధానంగా తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నారు పూరి. కానీ ఏ ఓక్క ప్లాన్ కూడా వర్కవుట్ కాలేదు. చివరికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ ని చేస్తానని మాట ఇవ్వడంతో పూరికి 'జనగణమన'పై కొత్త ఆశలు చిగురించాయి. అయితే చివరికి ఈ ప్రాజెక్ట్ ని చేయడానికి మహేష్ ఆసక్తిని చూపించకుండా తప్పుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.
అప్పటి నుంచి మహేష్ తో సినిమా చేయడానికి పూరి ప్రయత్నించలేదు. పూరితో సినిమా చేయాలని మహేష్ కూడా అడుగులు వేయలేదు. ఇటీవల విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తిని చూపించడంతో మళ్లీ పక్కన పెట్టిన స్క్రిప్ట్ కి దుమ్ముదులిపి పట్టాలెక్కించాడు. ఫస్ట్ షెడ్యూల్ ని కూడా పూర్తి చేశారు. పూజా హెగ్డే హీరోయిన్. భారీ స్థాయిలో రూ. 100 కోట్ల బడ్జెట్ తో రూపొందించాలని ప్లాన్ చేసుకున్నారు.
అయితే రీసెంట్ గా 'లైగర్' భారీ డిజాస్టర్ గా నిలవడంతో పూరి మరోసారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టినట్టుగా వార్తలు షికారు చేయడం మొదలు పెట్టాయి. మహేష్ చేయడానికి ఆసక్తి చూపించని క్షణం నుంచే 'జనగణమన'పై పూరికి ఆసక్తి పోయిందట.
కానీ విజయ్ చెప్పడంతో మళ్లీ పట్టాలెక్కించాడని, అయితే ప్రస్తుతం వున్న సమీకరణాల వల్లీ ప్రాజెక్ట్ ఇక పక్కన పెట్టినట్టేనని ఇన్ సైడ్ టాక్. మరో హీరోతో వెళ్లాలని అనుకున్నా పూరి వున్న పరిస్థితుల్లో రూ. 100 కోట్ల సినిమా అంటే బిగ్ రిస్క్.. ఈ కారణం వల్లే పూరి ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.