Begin typing your search above and press return to search.
'మిన్నల్ మురళీ' డైరెక్టర్ మూవీ పరిస్థితేంటీ?
By: Tupaki Desk | 23 Dec 2022 12:31 PM GMTఈ మధ్య యంగ్ డైరెక్టర్లు హీరోలుగా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ కాన్సెప్ట్ ఓరియెండ్ సినిమాలతో అదరగొడుతున్నారు. అత్యంత తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తూ, నటిస్తూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు. రీసెంట్ గా తమిళ యంగ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ తనే హీరోగా నటిస్తూ రూపొందించిన మూవీ 'లవ్ టుడే' తమిళంలోనే కాకుండా తెలుగులోనూ సంచలన విజయాన్ని సాధించిన వసూళ్ల వర్షం కురిపించింది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు వసూళ్లని రాబట్టి సంచలనం సృష్టిస్తోంది.
ఇప్పుడు ఇదే తరహాలో మలయాళంలో 'మిన్నల్ మురళి' మూవీతో వార్తల్లో నిలిచిన దర్శకుడు బాసిల్ జోసెఫ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'జయ జయ జయ హే'. విపిన్ దాస్ దర్శకత్వంలో లక్ష్మీ వారియర్, విపిన్ దాస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. బాసిల్ జోసెఫ్ హీరోగా నటించిన ఈ మూవీలో 'హృదయం' ఫేమ్ దర్శన రాజేంద్రన్ హీరోయిన్ గా నటించింది. రూ.5 కోట్లతో నిర్మించిన ఈ మూవీ అక్కడ అక్టోబర్ 28న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
మలయాళ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 40 కోట్ల వసూళ్లని కేవలం 25 రోజుల్లోనే రాబట్టి ట్రేడ్ పండితులనే షాక్ కు గురిచేసింది. మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఈ మూవీని తెలుగులో డబ్బింగ్ చేయాలని పలువురు నిర్మాతలు భావించారు. అయితే మేకర్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారికి భారీ రేట్ కి ఇచ్చేయడంతో ప్రస్తుతం ఈ మూవీ స్త్రీమింగ్ మొదలైంది. ఈ సినిమాపై ఇటీవల వార్తలు రావడంతో ఈ మూవీ కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆసక్తిగా వెతుకుతున్నారట.
ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఓ యువతి జయ. తను అమ్మాయి కావడంతో తన సోదరుడికి ఇచ్చిన ప్రాముఖ్యతను తనకు పేరెంట్స్ ఇవ్వకపోవడంతో పేరెంట్స్ చూపిస్తున్న పార్షియాలిటీని ప్రశ్నిస్తుంది. ఓ విధంగా సంప్రదాయ కట్టుబాట్లకు విరుద్ధంగా పోరాడాలని నిశ్చయించుకుంటుంది. తన ప్రవర్తన నచ్చని పేరెంట్స్ పౌల్ట్రీ ఫామ్ ఓనర్ అయిన హీరోకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. ఆ క్రమంలో ఏజరిగింది? ఆ క్రమంలో జయ తనకు ఎదురైన సవాళ్లని ఎలా ఎదుర్కొంది అన్నదే ఈ చిత్ర కథ.
మలయాళ ఇండస్ట్రీలో మంచి టాక్ తో పాటు భారీ వసూళ్లని రాబట్టిన ఈ మూవీకి ఓటీటీలో మాత్రం ఆ స్థాయిలో ఆదరణ దక్కడం లేదు. చాలా మంది ఈ కథకు ఇంత హైప్ ఇచ్చారేంటని కామెంట్ లు చేస్తున్నారు. చాలా బోరింగ్ స్టోరీ అని, నరేషన్ చాలా స్లోగా వుందని విమర్శలు చేస్తున్నారు. కొంత మంది కాన్సెప్ట్, సహజత్వంగా సాగే కథ అంటూ ప్రశంసలు కురిపిస్తుంటే కొంత మంది మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.