Begin typing your search above and press return to search.
పునీత్ పెండింగ్ సినిమాల పరిస్థితేంటి?
By: Tupaki Desk | 1 Nov 2021 9:35 AM GMT46ఏళ్ల వయసుకే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం అభిమానుల్ని కలచివేసింది. కన్నడ ఇండస్ట్రీలో నంబర్ వన్ స్టార్ గా అతడు తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ఇప్పటికే అతడు `ద్విత్వ` లాంటి భారీ పాన్ ఇండియా చిత్రానికి సంతకం చేశారు. ఇది ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ని మించి అత్యంత భారీగా తెరకెక్కనుందని కూడా కథనాలొచ్చాయి. కానీ ఇంతలోనే పునీత్ ఆకస్మిక మరణం ప్రతిదీ మార్చేసింది.
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పునీత్ అసంపూర్ణ ప్రాజెక్టులను పూర్తి చేయడమెలా? అంటూ ఇప్పుడు విశ్లేషణ సాగుతోంది. జేమ్స్ నుండి ద్విత్వ వరకు అతని ప్రాజెక్ట్ లను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. డబ్బింగ్ దశకు చేరుకున్నవాటికి సాంకేతికతతో మ్యానేజ్ చేస్తారు. ప్రారంభంలోనే ఉంటే వేరే హీరోతో రీప్లేస్ చేయడమే ఉత్తమ మార్గం.
పునీత్ రాజ్‌కుమార్ మృతితో ఇండస్ట్రీ సడెన్ గా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అతడు ప్రస్తుతం చేతన్ కుమార్ దర్శకత్వంలో జేమ్స్ షూటింగ్ లో ఉన్నాడు. తన కెరీర్ లో పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. పునీత్ షూటింగ్ లో ప్రధాన భాగాన్ని పూర్తి చేశాడు. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ కథానాయిక. ఇకపోతే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 17న పునీత్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేస్తారని సమాచారం. టాకీ పూర్తి చేసి డబ్బింగ్ సమయంలో పునీత్ మరణించారు కాబట్టి ఇప్పుడు చిత్రీకరణ సమయంలో అతడి డైలాగుల్ని అధునాతన సాంకేతికతతో బెటర్ మెంట్ చేస్తారని తెలిసింది. దీనిని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.
తదుపరి ద్విత్వ లోనూ పునీత్ నటించాల్సి ఉంది. నవంబర్ లేదా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లాలని నిర్ణయించారు. ఇది పవన్ కుమార్ తో మొదటి చిత్రం. సంతోష్ ఆనంద్ రామ్ తో మరో చిత్రం చేయాల్సి ఉంది. వీరిద్దరూ రాజకుమార- యువరత్న చిత్రాలకు కలిసి పనిచేశారు. ఇది కాకుండా పునీత్ తన హోమ్ బ్యానర్ లో ఐదు సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. ఇవన్నీ పెండింగ్ లో పడ్డాయి. ఇక ద్విత్వ చిత్రాన్ని వేరేక హీరోతో భర్తీ చేస్తారు అనుకుంటే ఇప్పటికే టాకీ పూర్తయిన జేమ్స్ సినిమా కోసం పునీత్ వాయిస్ ని కనుగొనాల్సి ఉంది. దీనికోసం అధునాతన సాంకేతికతను ఉపయోగించి యథాతథంగా వాయిస్ లభించేలా ప్రయత్నించనున్నారట. ఇక జేమ్స్ లో టాకీ పార్ట్ లో ఇంకా మిగిలి ఉన్న భాగాల్ని మేనేజ్ చేయాల్సి ఉంటుందని కథనాలొస్తున్నాయి.
పునీత్ స్వగతం పరిశీలిస్తే.. అతడిని అభిమానులు అప్పూ అని పిలుచుకుంటారు. లెజెండరీ స్టార్ రాజ్‌కుమార్ - పార్వతమ్మల కుమారుడు. 29కి పైగా కన్నడ చిత్రాలలో కథానాయకుడిగా నటించాడు. అతను బాల నటుడిగా కెరీర్ ను ప్రారంభించాడు.1985లో బెట్టాడ హూవులో తన నటనకు ఉత్తమ బాలనటిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నాడు. చలీసువ మొదగలు - యెరడు నక్షత్రాలు చిత్రాలలో తన నటనకు కర్ణాటక రాష్ట్ర ఉత్తమ బాలనటుడిగా అవార్డును గెలుచుకున్నాడు. పునీత్ అప్పు (2002)తో హీరోగా మారాడు. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత అతని అభిమానులు అతన్ని అప్పూ అని పిలవడం పరిపాటిగా మారింది. పునీత్ నటించిన పాపులర్ చిత్రాలలో అభి- వీర కన్నడిగ- అజయ్- అరసు- రామ్- హుడుగారు -అంజనీ పుత్ర మొదలైనవి ఉన్నాయి. అతను చివరిసారిగా ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన యువరత్నలో కనిపించారు.